హోదా వచ్చేసినట్లేనని వెంకయ్య జోకులు | venkaiah naidu again satire on AP special status

Venkaiah naidu again satire on ap special status

venkaiah naidu again satires, venkaiah satire on special status, Modi laugh AP special status done, venkaiah on Modi laugh, Modi laugh at MP shiva prasad

venkaiah naidu again satire on AP special status.

పగలబడి నవ్వితే పని అయినట్లేనా ఎంకన్నా?

Posted: 08/06/2016 12:45 PM IST
Venkaiah naidu again satire on ap special status

ఏపీలో అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్షాలన్నీ ఏకమై ప్రత్యేక హోదా కోసం పోరు బాట సాగిస్తున్నాయి. ఏపీ కేసీఆర్ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంట్ ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న హస్తినలో జరిగిన పలు పరిణామాలతో కేంద్రం ఈ అంశంలో కాస్త అనుకూలతనే చూపినట్లేనని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిర్ణయం వెలువడేదాకా బీజేపీని అస్సలు నమ్మొద్దని రాజకీయ విశ్లేషకులు పార్టీ నేతలకు సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా సీరియస్ విషయాలలో కూడా సిల్లీనెస్ ను ప్రదర్శించే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, హోదాపై మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయటం విమర్శలకు తావిస్తోంది. హోదా అంశంతో కాస్త తడబడిన బీజేపీకి దిద్దుబాటు చర్యల్లో ఉండగానే, మిత్రపక్షం టీడీపీ షాకుల మీద షాకులు ఇచ్చింది. అయినా బీజేపీ మాత్రం చర్చల పేరుతో శాంతింపజేసే ప్రయత్నం చేసింది . ఇందులో భాగంగా పార్లమెంట్ లో ఓవైపు రభస జరుగుతుండగానే, శుక్రవారం టీడీపీ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్ర పఠనంతో మోదీ పగలబడి నవ్విన విషయమూ విదితమే.

మోదీ ఎంపీల భేటీలో ఏం జరిగిందని వెంకయ్యను మీడియా ప్రశ్నిస్తే సానుకూల నిర్ణయమే తీసుకోబోతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి అన్యాయం చేయబోమని ఆయన పాత మాటే చెప్పుకోచ్చారు. ఇక మోదీ అంతలా ఎందుకంతలా నవ్వారని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా... ‘‘మోదీ అంతగా పగలబడి నవ్వారంటే అర్థం పని అయిపోయినట్లేనని చెప్పాడు. ‘‘మీ పని అయిపోయింది, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే’’అని ఎంపీలతో అలా సింబాలిక్ గా చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  laugh  MP Shiva Prasad  venkaiah naidu  satire  AP special status  

Other Articles