కోదండరాంపై కడియం ఘాటు వ్యాఖ్యలు | Kadiyam Srihari comments on Kodandaram

Kadiyam srihari comments on kodandaram

Kadiyam Kodandaram, Kadiyam comments on Kodandaram, Kadiyam Srihari sensational comments on Kodandaram, Kadiyam comments on JAC chairman

Telangana Deputy CM Kadiyam Srihari comments on Professor Kodandaram.

కోదండరాం ఎంతలో ఉంటే అంత మంచిదట!

Posted: 08/06/2016 03:02 PM IST
Kadiyam srihari comments on kodandaram

రెండేళ్ల పాలన పూర్తయినప్పటి నుంచి జేఏసీ నేత కొదండరాం వర్సెస్ టీఆర్ఎస్ వార్ కొనసాగుతున్నది తెలిసిందే. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనే పదాన్ని పూర్తిగా విస్మరించారని, రెండేళ్లలో ఏం చేయలేదంటూ పెదవి విరుపులు మాట్లాడారు కొదండరాం. దీంతో టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల ప్రభావంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని కొందరంటే... కాదు, రాష్ట్ర కాంక్ష సిద్ధించిన తర్వాత ఉద్యమ నేతను కేసీఆర్ నిర్లక్ష్యం చేయటంతోనే కోదండరాం ఇలా మారిపోయాడన్నది మరికొందరి వాదన. అందులో నిజానిజాలను పక్కనబెడితే...

మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఘాటు విమర్శలు చేసేందుకు వెనకంజే వేసిన ఆయన, కొద్దిపాటి విమర్శలతోనే సరిపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. కోదండరాంపై తమకు గౌరవం ఉందంటూనే, మరోపక్క కడియం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

వరంగల్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.... కోదండరాం కూడా జయశంకర్ బాటలోనే నడవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం అంటే తమకు ఎలేని గౌరవం ఉందన్న కడియం, తాజాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం బాగా లేదని అంటున్నాడు.

కోదండరాంపై ప్రభుత్వంతోపాటు ప్రజలకు కూడా ఇంకా నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వానికి కోదండరాం సూచనలు చేస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే ప్రతిపక్షాల చెప్పుడు మాటలకు బానిసై కోదండరాం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలను గుర్తించి కోదండరాం ప్రతిపక్షాల గాలంకు చిక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరి దీనికి కోదండరాం సారూ ఏం రిప్లై ఇస్తారంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Deputy CM  Kadiyam Srihari  JAC  Kodandaram  

Other Articles