Vijay Rupani: From Rangoon-born RSS boy to next CM of Gujarat

Vijay rupani the new gujarat cm

gujarat chief minister, anandiben patel, new gujarat cm vijay rupani, gujarat deputy cm nitin patel, amit shah, bjp state president, RSS, RSS mohan bhagavat, Governor O P Kohli, gujarat, BJP

The BJP top brass chose its state unit president and minister Vijay Rupani as the new Chief Minister of Gujarat, replacing Anandiben Patel who resigned earlier this week.

గుజరాత్ కొత్త సీఎం విజయ్ రూపానీ.. ఆదివారమే ప్రమాణం

Posted: 08/06/2016 07:17 AM IST
Vijay rupani the new gujarat cm

అనుకున్నదే జరిగింది. అరెస్సెస్ నేపథ్యం వున్న గుజరాత్ బీజేపి అధ్యక్షుడు విజయ్ రూపానీ ఆ రాష్ట ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్నారు. ఇప్పటివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న అనందిబెన్ పటేల్ తన పదవికి సోషల్ మీడియా ద్వారా రాజీనామా చేయడంతో గత కొంతకాలంగా ఆ పదవిని ఎవరు చేపడతారా అన్న ప్రశ్నకు బీజేపి, అరెస్సెస్ లు తెరదించాయి. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తానని పేర్కొన్నారు. తనకు గొప్ప బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.... పటేల్ తనకీ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  

ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో.. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్నిదక్కించుకున్నవిజయ్ రూపానీ పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పని చేసిన ఆయన.. తనకప్పగించిన బాధ్యతలను సద్వినియోగం చేసుకొని, గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ముందుంటానన్నారు. అంతేకాక దేశంలోని రాష్ట్రాలన్నింటిలో ప్రత్యేకంగా తీర్చి దిద్దుతానని, దేశానికే రోల్ మోడల్ గా మారుస్తానని అన్నారు. భారతీయ జనతాపార్టీ  నిర్ణయంమేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. మీడియా ముందు రూపానీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం పదిమంది బిజేపీ మంత్రులు రూపానీని ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్ ను చేసేందుకు మద్దతు పలికినట్లు గడ్కరీ తెలిపారు. అంతకు ముందు ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చినా.. పార్టీ నిర్ణయం మేరకు ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. కాగా వీరు అదివారం రోజున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకరం చేయనున్నారు. శనివారం వారు గవర్నర్ ఓపి కోహ్లీని కలసి పార్టీ అందించిన నియామక పత్రాలను సమర్పించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  vijay rupani  nitin patel  anandiben patel  amit shah  rss  bjp  

Other Articles