Curious cop unzips suitcase to find 11-year-old boy STUFFED inside

In brazil police arrest woman for human trafficking

woman arrested for human trafficking, Natasha Vitoriano Souto’s luggage, human trafficking, Brazil, people smuggling, boy in suitcase, smuggling, brazil crime, Brazilian crime, rio crime

A WOMAN has been arrested after an 11-year-old boy was found bundled inside her suitcase. Bemused police found the young boy stowed away in Natasha Vitoriano Souto’s luggage after he reportedly asked her to adopt him.

ITEMVIDEOS: నటాషా సూట్‌కేసులో 11ఏళ్ల బాలుడు.. పోలీసులు షాక్..!

Posted: 08/05/2016 12:09 PM IST
In brazil police arrest woman for human trafficking

ఆ యువతి భారీ లగేజీతో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఓ భారీ సూట్‌కేసు పట్టుకొని అటు-ఇటు అనుమానాస్పదంగా తిరిగింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ సూట్‌కేసులో ఏం తీసుకెళ్తున్నావని ఆమెను ఆరా తీశారు. సరైన సమాధానం రాకపోవడంతో సూట్‌కేసును తెరిచిచూశారు. వారిని బిత్తరపరుస్తూ ఓ 11 ఏళ్ల బాలుడు అందులోంచి బయటకు వచ్చాడు. సూట్‌కేసులోంచి బుడగలాగా బయటకు తేలిన ఆ బాలుడిని చూసి పోలీసులు షాక్‌ తిన్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.   

23 ఏళ్ల నాటాషా విటోరియానో సౌటోకు 11 ఏళ్ల బాలుడు రోడ్డు మీద కనిపించాడు. తన తల్లిదండ్రులు డ్రగ్స్‌కు బానిసలై తనను వేధిస్తున్నారని, తనను వారి నుంచి కాపాడాలని ప్రాధేయపడ్డాడు. తనను దతత్త తీసుకోవాలని కోరాడు. బాలుడి దీనావస్థతో కరిగిపోయిన సౌటో అతడిని కాపాడి తన వెంట ఇంటికి తీసుకెళ్లాలని నిశ్చయించింది. అందుకోసమే అతి జాగ్రత్తగా బాలుడిని బ్లాంకెట్‌లో చుట్టి.. అతడిని సూట్‌కేసులో తోసి.. దానిని పట్టుకొని రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. అనుమానం వచ్చిన పోలీసులు తెరువడంతో అసలు బండారం బయటపడింది.

ఒలింపిక్స్‌ వేడుకలు జరుగనున్న రియో డీజెనిరోకు 550 ఏళ్ల దూరంలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాలుడిని సంరక్షణ కేంద్రానికి అప్పగించిన పోలీసులు అతన్ని సూట్‌కేసులో తీసుకెళ్లిన యువతిపై ముందుగా ఎలాంటి అభియోగాలు నమోదుచేయని పోలీసులు చివరకు మాత్రం అమెపై కూడా అక్రమంగా మనుషుల రవాణాకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. దీంతో పాటు బాలుడు వెలువరించిన వివరాలను కూడా నమోదు చేసుకున్నపోలీసులు అ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Natasha Vitoriano Souto  11 years boy  human trafficking  brazil  police  crime  

Other Articles