ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంతే | RSS shocks to BJP may lose Gujarat if polls are held now

Rss shocks to bjp may lose gujarat if polls are held now

Gujarat RSS surney, RSS survey shocks to BJP, BJP lost in Gujarat, Gujarat RSS BJP, BJP may lost in Gujarat, reasons for BJP lost in Gujarat

RSS survey says BJP may lose Gujarat if polls are held now.

గుజరాత్ లో ఘోరమైన దెబ్బ?

Posted: 08/04/2016 10:32 AM IST
Rss shocks to bjp may lose gujarat if polls are held now

గుజరాత్ ముఖ్యమంత్రి వ్యవహారంలో తలనొప్పులు ఎదుర్కుంటున్న బీజేపీకి మిత్రపక్షం ఆర్ఎస్ఎస్ గట్టి షాకే ఇచ్చింది. గుజరాత్ ఎన్నికలు కీలకంగా భావిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కోల్పోవటం కాదు, ఊహించని రీతిలో చిత్తుగా ఓడిపోతుందని చెబుతోంది.

బీజేపీ అనుబంధ విభాగం ఆరెస్సెస్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఇది బయపడింది. గుజరాత్ లో గోవు మాంసం తిన్నారన్న కారణంగా దళిత యువకులపై జరిగిన దాడి, పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం ఆ పార్టీకి గట్టి దెబ్బే కొట్టబోతున్నాయని సంకేతాలు పంపింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం దేశంలోనే గట్టి పట్టున్న గుజరాత్ లోనూ దారుణ ఓటమి తప్పదని అందులో తేలింది.

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లుండగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... బీజేపీకి కేవలం 60 నుంచి 65 సీట్లు మాత్రమే వస్తాయట. అదే వచ్చే ఏడాది జరిగితే ఆ డ్యామేజ్ లో కొంత తగ్గే అవకాశం ఉందని, 18 ప్రధాన అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమి తప్పదని అంటోంది. దళిత యువకులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ను అమాంతం కిందకు పడేసిందని స్వయంగా కర సేవకుల చేత చేయించిన సర్వేతో తేలింది.

మరోవైపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆ రాష్ట్రంలో గిరిజనులు కూడా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఆ సర్వే డేంజర్ బెల్స్ మోగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్న నేపథ్యంలో ఈ సర్వే మరింత ఇబ్బందికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Gujarat  RSS  Survey  lost  

Other Articles