RDP unveils ThinBook ultra slim India's most affordable laptop

Rdp unveils india s most affordable laptop

RDP Workstations, thin book, slim laptop, KT Rama Rao, Microsoft, Intel, assembly plant, RDP Laptop, Indian market, new affordable ThinBook, affordable personal computing, Intel Atom x5-Z8300, PTI GDK NSK, trustworthy computing devices, KT Rama Rao, 10X data transfer, companys new product, Intel South Asia, technology, technology news

Tech firm RDP Workstations today launched 14.1" ThinBook which the company claims to be the most affordable laptop.

రూ. పది వేలకే ఆర్‌డీపీ ల్యాప్‌టాప్‌

Posted: 08/03/2016 07:05 PM IST
Rdp unveils india s most affordable laptop

ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఆర్‌డీపీ వర్క్‌స్టేషన్స్ ల్యాప్‌టాప్‌ల విపణిలోకి అడుగుపెట్టింది. అంతేకాదు.. మార్కట్లలోని తమ పోటీదారులందరికీ షాక్ ఇస్తూ అత్యంత తక్కువ ధరకు ల్యాప్‌టాప్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఆర్‌డీపీ థిన్‌బుక్ పేరుతో 14.1 అంగుళాల ల్యాప్‌టాప్‌ను రూ.9,999లకే ప్రవేశపెట్టింది. భారత్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఉపకరణం ఇదేనని కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు దీనిని విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారంతో ఈ థిన్‌బుక్‌ను రూపొందించారు.

ల్యాప్‌టాప్‌ల ఫీచర్లు ఇలా వున్నాయి: విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జడ్8300 ప్రాసెసర్, అల్ట్రా షార్ప్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ 2.0, యూఎస్‌బీ 3.0, వీజీఏ కెమెరా, డ్యూయల్ హెచ్‌డీ స్పీకర్స్, బ్లూటూత్, వైఫై, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర విశిష్టతలు. 1.45 కిలోల బరువు, 20 మిల్లీమీటర్ల మందం ఉంది.

సర్వర్ ఆధారిత కంప్యూటింగ్ సేవలు అందిస్తున్న ఆర్‌డీపీ ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లను తైవాన్‌లో తయారు చేయిస్తోంది. సాధారణ టీవీలను కంప్యూటర్‌గా మార్చే ప్లగ్ పీసీలు 10,000 యూనిట్లకుపైగా విక్రయించింది. ఈ నెలలోనే విండోస్ ట్యాబ్లెట్ పీసీలను రూ.5,500లోపు ధరలో ప్రవేశపెడతామని కంపెనీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి వెల్లడించారు. ఏడాదిలో తెలంగాణలో రూ.20 కోట్లతో అసెంబ్లింగ్ ప్లాంటు రెడీ అవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఔట్‌లెట్లలో తమ ఉత్పత్తులు లభిస్తాయని వివరించారు. ఆర్‌డీపీ.ఆన్‌లైన్‌తోపాటు ఇతర ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా ఉపకరణాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles