హోదా కోసం తెలుగు ఎంపీల పార్లమెంట్ పోరు | Telugu MPs continue protest in Parliament for special status

Tdp ysrcp mps protest continue in parliament for special status

TDP YSRCP MPs Protest, Telugu MPs continue protest, TDP protest in parliament, YSRCP protest in parliament, TDP YSRCP slogans, TDP MPs in parliament, YSRCP MPs in parliament, AP special status in lok sabha

TDP YSRCP MPs continue thier protest in Parliament for special status.

ITEMVIDEOS: విడివిడిగా.. కలిసికట్టుగా హోదా కోసం...

Posted: 08/02/2016 12:24 PM IST
Tdp ysrcp mps protest continue in parliament for special status

ప్రత్యేక హోదా కోసం పోరుబాట మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మంగళవారం కూడా దానిని కొనసాగిస్తున్నారు. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ టీడీపీ, వైసీపీ ఎంపీలంతా నిన్న పార్లమెంటు లోపలా, బయటా నిరసనలతో హోరెత్తించగా, నేడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభలోకి నిన్నటి మాదిరే ప్లకార్డులు చేతబట్టుకుని వచ్చిన టీడీపీ ఎంపీలు ‘హోదా’ నినాదాలతో హోరెత్తించారు.

ఓవైపు హోదా ప్రకటించాలంటూ వైసీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లితే, టీడీపీ ఎంపీలు చర్చకు అనుమతించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అందుకు నిరాకరించడంతో వారు కూడా వెల్ లోకి దూసుకెళ్లి వైసీపీ ఎంపీలతో కలిసి నినదించారు. ప్రారంభమైన వెంటనే లోక్ సభలో గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది.

సమావేశాలకు ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విడివిడిగా ధర్నాకు దిగిన సందర్భంగా ఇరు పార్టీల ఎంపీలు ఏపీకి ప్రత్యేక ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ముందుగా అక్కడికి చేరుకున్న వైసీపీ ఎంపీలు నినాదాలు చేస్తుండగా, అంతలో తోట త్రిమూర్తులు నేతృత్వంలో అక్కడికి చేరుకున్న టీడీపీ ఎంపీలు వారితో జత కలిశారు. ఆ తర్వాత కాసేపటికి వైసీపీ ఎంపీలు అక్కడి నుంచి వెళ్లిపోగా, టీడీపీ ఎంపీలు మాత్రం ఆందోళన కొనసాగించారు. మొత్తానికి నిన్నటి నుంచి కలిసి ఉంటూ ఓసారి, విడివిడిగా మరోసారి ఆయా పార్టీల ఎంపీలు హోదా నినాదాలు చేస్తుండటం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేకంగా కనిపించింది.

ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, ఏపీతో పాటు అటు ఢిల్లీలోనూ కాక పుట్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తన నిరసనను కొనసాగిస్తున్నారు.  ఈ క్రమంలో నల్లబ్యాడ్జీ పెట్టుకుని మరీ ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. సభలోకి వెళ్లే ముందు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు. మొత్తానికి ఏ ఒక్క ఎంపీకి కూడా రాని ఆలోచనతో ముందుకు సాగిన కేవీపీకి అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్షం వైసీపీ కూడా చచ్చినట్లు మద్దతు తెలపక తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  MPs  special status  parliament  BJP  

Other Articles