FIR against DCW chief Swati Maliwal for allegedly naming 14-year-old Dalit rape victim

Fir against dcw chief swati maliwal for allegedly naming rape victim

swati maliwal, swati maliwal fir, fir swati maliwal, dcw chief swati maliwal, swati maliwal dalit rape, dalit rape swati maliwal, burari rape maliwal, burari rape vicitm, india news

A 14-year-old Dalit girl died on Sunday at a Delhi hospital after being forced to drink a corrosive substance by the accused.

ఈ పోలీసుల రూటు సపరేటు గురూ..!

Posted: 07/26/2016 09:34 PM IST
Fir against dcw chief swati maliwal for allegedly naming rape victim

దేశ రాజధాని పోలీసులు దేశంలోని పోలీసులకే అదర్శంగా నిలవాల్సింది పోయి.. తమ రూటు ఎప్పటికీ సపెరేటు అని రుజువు చేసుకున్నారు. తమ పనితీరును పదే పదే ప్రశ్నించినందుకు గాను ఏకంగా మహిళా కమీషన్ చీఫ్ పైనే కేసులు నమోదు చేసి.. అవసరం అయితే కేసును ఇలా కూడా తారుమారు చేస్తామని నిరూపించుకున్నారు. దేశ రాజధానిలో రోజుకో అత్యాచార ఘటన నమోదవుతున్న నేపథ్యంలో అందోళనకు గురైన స్వాతి మాలివాల్ పోలీసు తీరును నిరసిస్తూ రాసిన లేఖలు, ట్వీట్లుతో నిజంగానే తమ పనితనం ఎక్కడ సామాన్యులకు కూడా అర్థమైపోతుందోనని అప్రమత్తమైన పోలీసులు అమె చేసిన తప్పును అసరాగా చేసుకుని ఏకంగా అమెపైనే కేసు పెట్టారు.

అమె చేసిన తప్పేమిటంటే.. అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టడమే. ఢిల్లీలో 14 ఏళ్ళ దళిత బాలికపై ఓ వ్యక్తి పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల యాసిడ్ కలిపిన పండ్ల రసాన్ని ఆమెతో తాగించడంతో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ గత ఆదివారం చనిపోయింది. అయితే ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌ పలుమార్లు పోలీసులకు లేఖలు, ట్వీట్లతో చీవాట్లు పెట్టారు. ఇంకా ఎంత మంది నిర్భయలు చనిపోవాలని ఆమె ప్రశ్నించారు. అందులో బాలిక పేరు బయటపెట్టారు. దీంతో ఢిల్లీ పోలీసులు మంగళవారం ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతిపై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swati Maliwal  DCW  DCW Chief  Dalit Rape Victim  Delhi  Crime  

Other Articles