జపాన్ లో వికలాంగులపై కత్తితో దాడి.. 19 మంది మృతి | Man kills at least 15 disabled persons in Japan knife attack

Man kills at least 15 people in japan knife attack

Man knife attack, Japan Knife attack, Disable persons died, Mental ill persons attack, Sagamihara attack

Man kills at least 15 disabled persons in Japan knife attack.

మానసిక వికలాంగులపై దాడి... 19 మంది మృతి

Posted: 07/26/2016 08:24 AM IST
Man kills at least 15 people in japan knife attack

జపాన్ వికలాంగుల రక్తంతో తడిసి ముద్దయిపోయింది. సోమవారం అర్థరాత్రి దాటాక 26 ఏళ్ల దుండగుడు సఘమిహారా పట్టణంలోని ఓ కేర్‌హోమ్‌పై కత్తితో దాడిచేసి అందులోని మానసిక వికలాంగులను దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

నల్ల దుస్తులు ధరించిన ఓ దుండగుడు సాగమిహర వికలాంగుల ఆశ్రమంలోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 19 మంది మృతిచెందినట్టు నిర్ధారించారు.అయితే గాయపడిన వారి సంఖ్య 50కి పైగానే ఉంటుందని స్థానిక మీడియా పేర్కొంది.

(భారత్‌ కాలమానం ప్రకారం) 2.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. దుండగుడిని సతోషి యెమత్సుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సంచిలో నుంచి రక్తంతో తడిసిన పలు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Japan  sagamihara  19 died  mental disabilities  

Other Articles