Delhi Couple romance at a red light in Delhi. No Shame No Hesitation.

Delhi couple hot romance on bike at a red light in delhi

Delhi Couple, Couple kissing, delhi couple kissing, hot romance on bike, romance in delhi, kissing in delhi, kissing at redlight, no shame, no hesitation, sex in delhi, sex at red light, india news, latest news, breaking news, trending video, viral video,

A Delhi based couple kissing at a traffic light in Delhi without hesitation and shame. No one stopped them but watched and enjoyed. Spreading wrong message to children sitting in a nearby car.

ITEMVIDEOS: దేశరాజధాని నడివీధుల్లో ప్రేమజంట అదర చుంభనం

Posted: 07/26/2016 07:24 AM IST
Delhi couple hot romance on bike at a red light in delhi

దేశ రాజధానిలో ఓ ప్రేమజంట బరితెగించింది. సభ్యత, సంస్కారాన్ని మర్చి నడివీధిలో పశువుల కన్నా దారుణంగా వ్యవహరించింది. దేశ ప్రజలను మనం భారత దేశంలోనే వున్నామా..? అన్న స్థితికి తీసుకెళ్లిన ఘటన ఇది. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలన్న భారత దేశంలోనే.. విదేశాల తరహాలో విచ్చలవిడిగా రెచ్చిపోయారు ఈ ప్రేమజంట. ఏం తిన్నామో కూడా పక్కింటి వారికి తెలియకుండా ఇంటి గుట్టును భధ్రంగా కాపాడుకోవలన్న భారతీయ పెద్దలు చెప్పిన నానుడి నుంచి బరితెగింపుగా వీధుల్లోకి రోమాన్స్ చేస్తున్న స్థాయికి వచ్చింది.

ప్రేమ పేరుతో కొందరు యువత బరితెగిస్తున్నారు. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య సాగిన రాసలీలలు నిన్న పార్క్‌ల్లోకొచ్చాయి. నేడు రోడ్డెక్కాయి. ఢిల్లీలో సరిగ్గా వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన మితిమీరిన స్వేచ్ఛకు, హద్దుమీరుతున్న ఆధునిక పోకడలకు నిదర్శనం. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. రాత్రి ఎనిమిది గంటల సమయం. వాహనాలన్నీ బారులు తీరాయి. ఇంత గందరగోళంలో అన్ని వాహనాలతో పాటే ఓ బైక్ కూడా ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. అందరి చూపూ ఆ బైక్ వైపే. దీనికి కారణం ఆ బైక్‌పై ఓ యువకుడు, యువతి కూర్చుని ఉన్నారు.

అందరిలా కాకుండా వారు బైక్ పై కూర్చున్న విధానమే మిగతా వాహనదారులను వారిపైపు అకర్షించింది. బైక్ నడిపిస్తున్న యువకుడి ముందు వెనక్కు తిరిగి యువతి కూర్చుంది. అది కూడా పెట్రోల్ ట్యాంక పైన. యువకుడు బైక్ నడిపే వారు కూర్చున్నట్లుగానే కూర్చున్నాడు. ఇకనేం ఇద్దరు ఎదరెదురుగా కూర్చోని, ఎక్కడ ట్రాపిక్ జామ్ అయినా.. బైక్ ఎక్కడ అగినా. అధర చుంబనాలు, కౌగిలింతలతో సరసాలు మొదలెట్టారు. అందరూ తమను చూస్తున్నారన్న సిగ్గూఎగ్గూ లేకుండా రెచ్చిపోయి ప్రవర్తించారు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనమైంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lovers  kissing  hugging  red light  delhi  viral video  crime  

Other Articles