Sushma Swaraj slams Pakistan over nawaz sharief remarks

Sushma swaraj slams pakistan over kashnir issue

sushma swaraj, kashmir, kashmir unrest, pakistan, nawaz sharif, sushma swaraj on kashmir, sushma swaraj on pakistan, pakistan in kashmir

Foreign minister Sushma Swaraj slammed Pakistan for its recent attempts to bring international focus on what Islamabad has termed as human rights violations in Indian-administered Kashmir.

ఇలాంటి వ్యాఖ్యలతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు..

Posted: 07/24/2016 08:20 AM IST
Sushma swaraj slams pakistan over kashnir issue

ఏదో ఒకరోజు కశ్మీర్.. పాకిస్తాన్‌లో భాగం అవుతుందన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్  వ్యాఖ్యలపై  భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. షరీఫ్ కల ఎప్పటికీ తీరదని తేల్చిచెప్పారు.  పాక్ ప్రధాని పగటి కలలు కనటం మానుకోవాలన్నారు. ప్రపంచంలోనే స్వర్గంలా వున్న భారత దేశాన్ని దయాధి దేశం పాకిస్థాన్.. ఆ దేశం మాదిరిగానే ఉగ్రవాదులకు స్వర్గధామం మాదిరిగా మార్చేందుకు కంటున్న కలులు ఎన్నటికీ నెరవేరమని అన్నారు. విదేశాంగ సహాయ మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్‌లతో కలసి సుష్మ ఈ ప్రకటన చేశారు.

‘ఈ ప్రమాదకర ఆలోచన కారణంగానే.. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. జమ్మూకశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమే. ఈ భూతల స్వర్గాన్ని ఉగ్రవాదుల అడ్డాగా మీరు మార్చలేరు’ అని సుష్మ అన్నా రు. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌పై పాక్ ప్రచారాన్ని ఖండించారు. క్రూరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని.. స్థానిక ప్రజాప్రతినిధులను, భద్రతా బలగాలను చంపిన వ్యక్తిని వీరుడిగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. కశ్మీర్‌కు ఉగ్రవాదులను, ఆయుధాలను పాకిస్తాన్ సరఫరా చేస్తోందని.. ఇక్కడి ప్రజల గురించి ఎప్పుడూ మంచిగా ఆలోచించలేదని విమర్శించారు. డబ్బు, ఉగ్రవాదం, వివాదాస్పద ప్రకటనలతో కశ్మీర్‌లో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Nawaz Sharif  Kashmir issue  pakistan  

Other Articles