Sexual harassment case against Trump resurfaces

Sexual harassment case against trump resurfaces

Donald Trump, sexual assault allegations, television networks, Makeup artist, Jill Harth, US news

Makeup artist, Jill Harth, has spoken for the first time in detail about sexual assault allegations that she levied against Donald Trump

నాపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు..

Posted: 07/24/2016 07:34 AM IST
Sexual harassment case against trump resurfaces

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీగా అధికారికంగా ట్రంప్‌ను ప్రకటించిన మరునాడే మేకప్ ఆర్టిస్ట్ జిల్ హార్ట్ తన 20 ఏళ్ల సుదీర్ఘ మౌనాన్ని వీడారు. ట్రంప్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. 1993లో ట్రంప్ పలుమార్లు తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ తనను ఏ విధంగా వేధించినదీ పూసగుచ్చినట్టు వివరించారు.
 
అందాల పోటీలలో భాగంగా ట్రంప్ ఇచ్చిన విందుకు హాజరైన తనకు చేదు అనుభవం ఎదురైందని జిల్ హార్త్ గుర్తుచేసుకున్నారు. తన ఎదురుగా కూర్చున్న ఆయన టేబుల్ కింది నుంచి తన శరీరాన్ని తడిమారని, ఆయన చేష్టలు భరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. ఓసారి అతని బెడ్‌రూములో తనపై లైంగిక దాడికి యత్నించారని ఆరోపించారు. పక్కగదిలో తాను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఉండడంతో తాను తీవ్ర భయానికి లోనైనట్టు చెప్పారు. ట్రంప్ తన మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత తనపై వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయన్నారు.
 
తాను లేకుండా బతకలేనని పలుమార్లు ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు. ఆయన వేధింపులు శ్రుతి మించడంతో చివరికి కేసు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. తనను వేధించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యానికి గురైనట్టు జిల్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ తనపై చేసిన లైంగిక దాడి గురించి మర్చిపోవాలని ప్రయత్నించానన్నారు. 1997లో ట్రంప్‌కు వ్యతిరేకంగా తాను పెట్టిన కేసును ఓ మీడియా సంస్థ తిరగదోడడంతో ఈ విషయంపై ఇప్పుడు నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తన ఇంటర్వ్యూ కోసం ఎన్నో సంస్థలు పోటీపడ్డాయన్నారు.
 
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ట్రంప్ కొట్టిపడేశారు. జిల్‌ హార్త్ అబద్దాల కోరని వ్యాఖ్యానించారు. ట్రంప్ కుమార్తె సైతం తండ్రిని వెనకేసుకొచ్చారని దీంతో సమాజం దృష్టిలో తాను చెడు వ్యక్తిగా మిగిలిపోకూడదనే ఈ విషయాలు బయటపెట్టాల్సి వచ్చిందని జిల్ పేర్కొన్నారు. ట్రంప్ కారణంగా తన వ్యాపారం దెబ్బతిందని, తన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని, ట్రంప్ తనకు క్షమాపణలు చెబితే ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుందని జిల్ హార్త్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles