diabetic patient falls into coma and comes to alive, after family members made cremation arrangments

Dead man comes to alive in vishaka

dead man comes alive, dead man comes alive in vishaka, dead man comes alive in munagapaka, diabetic patient, sitaram, dead man alive, gavarla anakapalli, munagapaka, vishaka, 108 staff, creamation arrangements, coma

dead man sitaram comes to alive after his family members made arrangments for his creamation in gavarla anakapalli village of munagapaka mandal, vishakapatnam

చనిపోయాడనుకున్న వ్యక్తిలో చలనం.. అంత్యక్రియలకు బ్రేక్..

Posted: 07/22/2016 08:41 AM IST
Dead man comes to alive in vishaka

అయష్సు తీరకముందే ఆ వ్యక్తికి అంత్యక్రియలు చేయాలని బావించారు కుటుంబసభ్యులు. అంటే వారేదో అయనపై కక్షగట్టి చేస్తున్న పనికాదు. ఆయన చనిపోయాడని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దృవీకరించిన తరువాతే ఇలా చేశారు. బతికున్న వ్యక్తిని చనిపోయాడని ఆ వైధ్యుడు ఎందుకు నిర్ధారించాడు. అంటే అ వ్యక్తి కోమాలోకి జారుకోవడమే అసలు కారణం. ఇంతకీ కోమాలోకి జారుకోవడానికి కారణం ఆ వ్యక్తి షుగర్ వ్యాధి గ్రస్థుడు కావడమే కారణం. షుగర్ లెవల్స్ తీవ్రంగా పడిపోవడంతో ఆయన కోమాలోకి జారుకున్నాడు. అంతే కుటుంబ సబ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో ఆయనలోకి కదలికలు గమనించి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వెంటనే అస్పత్రికి తరలించారు. ఇప్పుడాయన చికిత్సపోందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలో గురువారం అదే జరిగింది. గ్రామానికి చెందిన కాండ్రేగుల సీతారామ్‌ (60) రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తుంటారు. కానీ గురువారం ఆరు గంటలైనప్పటికీ లేవకపోవడంతో ఆయన భార్య లక్ష్మి ఆందోళనకు గురై స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుణ్ని రప్పించారు. అతను పరీక్షలు చేసి చనిపోయాడని చెప్పడంతో బంధువులందరికీ కబురుపెట్టారు. సాయంత్రం అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లుచేశారు.

ఎలమంచిలి నుంచి సమీప బంధువులు రావడం ఆలస్యం కావడంతో సాయంత్రం ఐదు గంటల వరకు చూసి అంత్యక్రియలు చేద్దామని భావించారు. ఇంతలో నాలుగు గంటల సమయంలో సీతారామ్‌ పొట్ట కదలడంతో అనుమానం వచ్చిన యువకులు 108కి ఫోన్‌ చేశారు. 108 వాహనంలో ఉన్న మెడికల్‌ టెక్నీషియన్‌ అప్పలనాయుడు.. సీతారామ్‌ పల్స్‌ చూసి వెంటనే డీ-25 బాటిల్స్‌ రెండింటిని ఎక్కించారు. దీంతో ఆయనలో చలనం ప్రారంభమైంది.

తక్షణమే అదే వాహనంలో ఆయన్ను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సీతారామ్‌ వైద్య సేవలు పొంది తిరిగి మాట్లాడడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సీతారామ్‌ను ప్రస్తుతం విశాఖలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సమీప గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. సీతారామ్‌కు షుగర్‌ బాగా పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారని, వైద్యం అందడంతో కోలుకు న్నారని వైద్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sitaram  dead man alive  gavarla anakapalli  munagapaka  vishaka  108 staff  creamation arrangements  coma  

Other Articles