Happy Guru Purnima: SMS, WhatsApp, Facebook greetings to thank your teachers and spiritual gurus

Guru purnima celebrations in both telugu states

guru purnima, guru poornima, guru purnima,fast and festivals,worship of guru,sai baba,dharma darshan,religion news,guru purnima 2016, shiridi sai, raghvendra swamy, guru datta, telugu states, Temples, veda vyasa, devotees, maharastra, Andhra pradesh, telangana

Guru Purnima is celebrated to show gratitude and respect to teachers who have moulded us and guided us at each step. Here are some SMSes, WhatsApp and Facebook messages and greetings to tell them how you feel.

దేశవ్యాప్తంగా గురుఫౌర్ణమి శోభ.. ఆలయాలన్నీ భక్తులతో కిటకిట..

Posted: 07/19/2016 07:04 AM IST
Guru purnima celebrations in both telugu states

గురుదేవుల పట్ల శిష్యులు తమ భక్తిని చాటుకునే పర్వదినం గురుఫౌర్ణమి. ఈ గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తమ తమ ఇష్ట దైవాలు, గురువుల ఆలయాలకు వెళ్లి ప్రత్యక పూజలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడి సాయిబాబా అలయాలతో పాటు అటు గురురాఘవేంద్ర స్వామి, వేదవ్యాస, వీరభ్రహ్మేంద్ర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌ సాయిబాబా ఆలయాలతో పాటు పలు ప్రాంతాలలో వున్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోని ఆలయాలు సాయినామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇటు తెలంగాణలోని సిద్దిపేట్, కరీంనగర్, సంగారెడ్డి, వరంగల్, హన్మకోండ, బోధన్, నిజామాబాద్ లలో కూడా సాయి  మందిరాలలో గురుపౌర్ణమి శోభ సంతరించుకుంది.

అటు మహారాష్ట్రలోని షిర్డీలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకుంటున్నారు. దీంతో వేకువ జాము నుంచే షిర్డీ భక్త జనసంద్రంగా మారింది. గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుక గురుపౌర్ణమి. వ్యాస పౌర్ణమినే.. గురుపౌర్ణమిగా ఆచరించాలని సాయినాథుడు ఆదేశించినట్లు భక్తుల విశ్వాసం. ఇటు కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురు రాఘవేంద్రస్వామి అలయంలోనూ భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రుని కృసా కటాక్షాల కోసం బారులు తీరారు. కర్నాటకలోని గానుగాపూర్ లో గల గురుదత్త ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. దేశంలోని పలుప్రాంతాల నుంచి గానుగాపూర్ చేరుకున్న భక్తులు అక్కడ గురుదత్తనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles