President Erdogan returns to Istanbul and government asserts it is in control

Erdogan apparently still in control after turkish coup attempt

military rule, coup attempt, president erdogan, american president barrack obama, islamic state terroe group, ISIS supporters, scams, government asserts control, indians, indian ambassy

Turkish soldiers secure the area, as supporters of Turkey's President Recep Tayyip Erdogan protest in Istanbul's Taksim square,

సంఘటిత ప్రజాశక్తి ముందు.. సైన్యం చిత్తు..!

Posted: 07/16/2016 04:02 PM IST
Erdogan apparently still in control after turkish coup attempt

సంఘటిత ప్రజా శక్తి ముందు సైనిక తిరుగుబాటు చిత్తయ్యింది. సైన్యం పకడ్భంధీ వ్యూహాన్ని.. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపుతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు చిత్తు చేశారు. ఎర్డోగాన్ పిలుపు మేరకు ప్రజలు విధుల్లోకి రావడంతో అధికార కాంక్షతో తెగబడిన సైన్యం తోక ముడిచింది. దీంతో టర్కీలో సైనిక తిరుగుబాటునను ఆయన ప్రజాబలంతో అణిచివేయగలిగారు. మొత్తానికి  ఈ ఘటనతో అధ్యక్షుడిగా తన పట్టును ఎర్గోగాన్ మరింత బిగించారు. తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ఆయన ఉక్కుపాదాన్ని మోపారు. సైన్యానికి కొత్త చీఫ్‌ను ప్రకటించారు. ప్రజల నుంచి కూడా మద్దతు లభించడంతో సైనిక తిరుగుబాటును తేలికగానే అణచివేయగలిగారు.

సైనిక తిరుగుబాటులో మొత్తం 161 మంది చనిపోయారు. 12 వందల మంది గాయపడ్డారు. సైనిక తిరుగుబాటు విఫలమైందని కొత్త ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. తిరుగుబాటు చేసిన 3000 మంది సైనికులను నిర్బంధించారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 29 మంది కల్నల్‌లను, ఐదుగురు జనరల్‌లపై వేటు వేశారు. టర్కీ వాయవ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలో ఓ చీలిక వర్గం ఇవాళ తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది.

టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ చానెల్‌ను తమ అధీనంలోకి తీసుకొని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటీన తిరిగివచ్చిన ఎర్గోగాన్ వెంటనే సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. సైనిక తిరుగుబాటు దేశద్రోహచర్య అని, దీనికి కారకులు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఎర్డోగాన్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమించడంతో టర్కీకి ఎర్డోగాన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coup attempt  Turky  President Tayyip Erdogan  

Other Articles