ఎవరైనా సర్కారుపై నిరసన ప్రదర్శించి తమ డిమాండ్లను సాధించుకునేందుకు వాటర్ ట్యాంకు, సెల్ టవర్లు ఎక్కి.. అక్కడ్నించి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం షరా మామూలే. అప్పుడెప్పుడో వచ్చిన పాపులర్ హిందీ చిత్రం షోలే నుంచి ఫ్యామిలీ సర్కర్ చిత్రం వరకు.. ఇటీవల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ డిమాండ్లను సాధించుకునేందుకు అమలుపర్చిన పంథా ఇది. అయితే త్రేతాయుగంలో జరిగిన మహాభారత యుద్దంలో తల్లి గర్బంలో వున్న అభిమన్యుడి మాదిరిగా పద్మవ్యూహంలోకి వెళ్లి ఎలా బయటకు రావాలో తెలియక ఇబ్బందులు పాలైయ్యాడు. ఇప్పుడింత ఉపోద్ఘాతం ఎందుకంటరా..?
రాజస్థాన్ రాష్ట్రంలో అభిమాన్యుడి మాదిరిగానే ఏకంగా 60 అడుగుల ఎత్తున్న నీళ్ల ట్యాంకు పైకి ఎక్కి హంగామా చేసింది. ఎవరంటారూ..? అని అడగకండీ మరెవరో కాదు.. ఓ ఎద్దు. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్లో సంచలనంగా మారింది. రాజస్థాన్ లోని చురు జిల్లా నవాల్ఘడ్ తాలూకాలోని రతన్ఘడ్ పట్టణంలో ఓ ఎద్దు ఏ మూడ్ లో ఉందో గాని 60 అడుగుల ఎత్తున్న నీళ్లట్యాంకుపైకి ఎక్కింది. ఇంత ఎత్తున్న నీళ్ల ట్యాంకు పైకి ఎద్దు ఎలా ఎక్కిందో తెలియదు కానీ.. కిందకు మాత్రం దిగడానికి భయపడింది. ఎంతలా అంటే ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు దానిని కిందకు తీసుకువచ్చేందుకు ఏకంగా ఎనమిది గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
వాటర్ ట్యాంకు పైకి ఎక్కిన ఎద్దు కిందకు దిగనంటూ మొరాయించడంతో ఓ పశువుల వైద్యుడి సాయంతో పాటు రాష్ట్ర వైపరీత్యాల సహాయక దళాన్ని రంగంలోకి దించారు. కిందికి దిగేందుకు మొరాయించిన ఎద్దుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపై దాన్ని తాళ్లు, సేఫ్టీ బెల్టులు కట్టి క్రేన్ సహాయంతో నేలపైకి దించారు. 8గంటల పాటు నీళ్ల ట్యాంకుపైన ఉన్న ఎద్దును కిందకు దించటానికి అధికారులు నానా హైరానా పడ్డారు. అయితే ఈ విషయాన్ని రాజస్తాన్లోని స్తానిక పోలీసులు కూడా నమ్మలేదు. వారికి గ్రామస్థులు వాట్సాఫ్ లో ఫోటోలు పంపినా.. అవి ఫోటో షాఫ్ ఫోటోలని భావించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేందుకు నిరాకరించారు.
చివరకు గ్రామస్థులు, వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎద్దును కిందకు దించేందుకు శ్రమిస్తున్న క్రమంలో అనుమానం కలిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో అక్కడికి హుటాహుటిన క్రేన్ ను రప్పించి ఎద్దును కిందకు దించేందుక సహకరించారు. కాగా ఈ వింత సంఘటనను జనం పెద్ద సంఖ్యలో గుమిగూడి చూశారు. నీళ్ల ట్యాంకు పైకి ఎక్కిన ఎద్దును చూస్తుంటే... మూగజీవి అయినా దాని డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్నట్లుందని స్థానికులు తమ ఫోన్లలో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఈ కాఫ్షన్ పెట్టి మరీ పోస్టులు పెట్టడంతో వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more