First picture of Mohamed Lahouaiej Bouhlel ID card found at scene of Nice lorry massacre

Nice attacks killer was known to police before bastille day slaughter

islamic state terroe group, ISIS supporters, celebrate, deadly attack, France, social media, President pranab mukharjee, PM modi, barrack obama, donald trump, mother may,france terror attack, nice terror attack, france bus crash, Bastille Day celebrations, national holiday, Day French, Riviera city of Nice, islamic state france attack, is france attack, france bus attack islamic state, Nice Attack, terrorist attack, France, MEA, Vikas Swarup, nice, france, sebastien humbert, nice bus attack

At least 84 people, including several children, are dead after a suspected terror attack on Bastille Day celebrations

ఫ్రాన్సులో అమాయకుల ప్రాణాలను బలిగొన్నది వీడే..!

Posted: 07/16/2016 07:49 AM IST
Nice attacks killer was known to police before bastille day slaughter

వీడే ఆ నరహంతకుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనబై నాలుగు మంది మూకుమ్మడిగా చంపిన త్రాష్టుడు. మరో 100 మందికి పైగా ప్రజలను క్షతగాత్రులను చేసిన పాపబీతిలేని దుర్మార్గుడు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై నిర్దాక్షిణ్యంగా ట్రక్కుతో దూసుకెళ్లి మారణహోమాన్ని సృష్టించిన ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాది వీడే. ఫ్రెంచ్-ట్యునీషియన్ అయిన 31 ఏళ్ల మహమద్ లహోహెజా బౌలెల్ అనే వ్యక్తిగా ఫ్రాన్సు పోలీసులు గుర్తించారు. ఈ దుర్మార్గానికి కారణమని ఇతడేనని పోలీసులు కనుగొన్నట్టు స్థానిక పత్రిక 'నీస్ మాటిన్' తెలిపింది. మహమద్‌కు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.

నీస్‌లో ఫ్రాన్సు జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లను అనందంగా చూస్తూ అదమరచిన ప్రజలపైకి ట్రక్కును పోనిచ్చి మహమద్ నరమేధాన్ని సృష్టించాడు. అతడు దూసుకుపోయిన మేరకు కుప్పలుతెప్పలుగా గాలిలోకి మనుషులు ఎగిరిపడ్డారని, సంఘటనా ప్రాంతంలో ఎక్కడా చూసిన రక్తపుమడుగులు ప్రజల మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నరమేధం ప్రారంభమైన అరగంట తర్వాత భద్రతా దళాలు సాహసోపేతంగా జరిపిన కాల్పుల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ప్రాణాలు విడిచాడని, అతను వాహనంలో ఉండగానే భద్రతాదళాలు కాల్పులు జరిపాయని, నేరుగా బుల్లెట్లు తగలడంతో వాహనం నడుపుతూనే అతను ప్రాణాలు విడిచాడని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles