change in Islamic State plan leads to deadly attack in France

Isis changed its plan and strategy in deadly france attack

islamic state terroe group, ISIS supporters, celebrate, deadly attack, France, social media, President pranab mukharjee, PM modi, barrack obama, donald trump, mother may,france terror attack, nice terror attack, france bus crash, Bastille Day celebrations, national holiday, Day French, Riviera city of Nice, islamic state france attack, is france attack, france bus attack islamic state, Nice Attack, terrorist attack, France, MEA, Vikas Swarup, nice, france, sebastien humbert, nice bus attack

Amid france police team security, and survelliance isis terror group creates deadly attack only with the change in their sketch and implementing plan

పంథా మార్చి ఉగ్రదాడి.. ఖండించిన ప్రపంచ దేశాలు

Posted: 07/15/2016 09:51 AM IST
Isis changed its plan and strategy in deadly france attack

ఫ్రాన్స్ పై గత నవంబర్ మాసంలోనే విరుచుకుపడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడి భద్రతా దళాలు చిక్కకుండా మరోమారు దాడి చేయాడానికి వారి ఎంచుకున్న పంథాయే కారణమని తెలుస్తుంది. ఫ్రాన్సు జాతీయ దినోత్సవ వేడుకల సంబరాలను జరుపుకుంటున్న తరుణంలో ఎక్కడికక్కడ భద్రతా దళాలు పకడ్భంధీ చర్యలను చేపట్టినా.. వారికి చిక్కకుండా 77 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనడానికి వారు మార్చిన రూటే కారణమని తెలుస్తుంది. గతంలో జనసామార్థ్యం వున్న ప్రాంతాల్లోకి చోచ్చుకెళ్లి అత్మహుతి దాడులుగా, లేక సాయుధులా వెళ్లి అక్కడున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నరేమేధం సృష్టించే ఐసిస్ ఉగ్రవాదులు.. మరికోందరిని బందీలుగా మర్చుకునే తమ ప్రణాళికలను మార్చుకున్నాయి. ఉగ్రదాడిలో కూడా తమ పంథాలు అనేకమంటూ ఫ్రాన్సులో ఇవాళ సృష్టించిన బీభత్సంతో స్పష్టం చేశాయి.

నైన్ నగరంలో నిర్వహిస్తున్న జాతీయ దినోత్సవ వేడుకల సంబరాల్లో స్థానికంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లను అస్వాధిస్తున్న ప్రజలపైకి భారీ ట్రక్కుతో వేగంగా వెళ్లి చిదిమేయాలని వ్యూహాన్ని రచించారు.  ఎవరూ ఊహించలేని విధంగా... నిఘా వర్గాలు కూడా పసిగట్టకుండా పథక రచన చేశారు. ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలతో పక్కా ప్లాన్‌తో ఈ దాడికి తెగబడ్డారు. కాగా అదే ట్రక్కులో వున్న మరో ఉగ్రవాది ప్రజలపై కాల్పులతో కూడా తెగబడ్డాడని సమాచారం.

అయితే ట్రక్కుతో ప్రజల్ని ఢీకోట్టి చంపాలన్న ఉగ్రవాదుల ప్రణాళిక బెడిసి కోట్టిన పక్షంలో ట్రక్కులో వున్న మందుగుండు సామాగ్రిని ప్రజలపైకి విసిరి పెను బీభత్సం సృష్టించాలని పథక రచన రచించారు. సకాలంలో భద్రతా బలగాలు స్పందించి ట్రక్కు డ్రైవర్ ను కాల్చిచంపడంతో పెను ప్రమాదం తప్పింది. అతనిని 31ఏళ్ల ట్యునీషియాకు చెందిన వ్యక్తిగా గుర్తించాయి. వాహనంలో ఉన్న మరో ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లో దాక్కోగా...  అతన్ని కూడా హతమార్చాయి. కాగా అతను ఎవరన్న వివరాలు తెలియాల్సి వుందని అధికారులు చెప్పారు.

ఘటనా స్థలంలో మరింతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతాబలగాలు అనుమానిస్తున్నాయి. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నీస్‌ నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్న సైన్యం... బీచ్‌రోడ్‌ను జల్లెడ పడుతోంది. రెస్క్యూటీం సహాయక చర్యలు చేపడుతోంది. సంఘటనా స్థలం నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అకస్మికంగా జరిగిన ఈ ఉగ్రదాడితో భయాందోళన చెంది స్థానిక హోట్లళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాల్లో దాక్కున ప్రజలను భద్రతా దళాలు సురక్షింతంగా తరలిస్తున్నాయి.

భారతీయులు సేఫ్..
కాగా ఈ ఉగ్రవాద దాడిలో భారతీయులెవరూ మృతి చెందలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులు మృతి చెందినట్టుగానీ, గాయపడినట్టు గానీ సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పారిస్ లోని భారత రాయబారి అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఫ్రాన్స్ లోని భారతీయుల కోసం రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపింది.

ప్రపంచ నేతల దిగ్బ్రాంతి
నీస్ దాడి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొన్న అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిని మతిలేని చర్యగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ కు అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అమెరికా ప్రజల తరపున భయానక ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. నీస్ దాడి నేపథ్యంలో రేపు జరగనున్న విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉగ్రదాడి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles