అక్కడ బాలికల కోసం వృద్ధులు మాత్రమే.. | Above 50 years teachers for Haryana school girls

Above 50 years teachers for haryana school girls

only old teachers for Haryana girls, Haryana teachers rule, teachers protest in Haryana

Haryana government today said under the new Teachers Transfer Policy-2016, only those teachers, who were above 50 years of age, would be posted at government senior secondary schools for girls.

అక్కడ బాలికల కోసం వృద్ధులు మాత్రమే...

Posted: 07/14/2016 09:34 AM IST
Above 50 years teachers for haryana school girls

పవిత్రమైన గురు వృత్తిలో ఉండి కీచక ప్రవృత్తిని వెలగబెట్టిన ఉపాధ్యాయుల ఉదంతాలు నిత్యం మనం చూస్తున్నాం. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు హర్యానా ప్రభుత్వం ఓ వింత నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా అమలులో లేని నిబంధనలను పెట్టిన హర్యానా ప్రభుత్వ వైఖరితో ఉపాధ్యాయులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి.

గర్ల్స్ స్కూళ్లలో తీసుకునే పురుష ఉపాధ్యాయుల వయసు కచ్చితంగా 50 సంవత్సరాలు నిండాల్సిందేనని కొత్త నిబంధన విధించింది. 2016-17 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని చెబుతూ, బదిలీల నిబంధనలను మార్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ మాట్లాడుతూ, గత సంవత్సరం జూన్ 30 నాటికి 50 ఏళ్ల నిండని ఉపాధ్యాయులను బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీపై పంపే ప్రశ్నేలేదని తెలిపారు.

ఒకవేళ బదిలీ ఆప్షన్ గా బాలికల పాఠశాలను ఎంచుకున్నా పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. బాలికల పాఠశాలల్లోని పురుష ఉపాధ్యాయులు, వారి విషయంలో తప్పుడు చర్యలకు దిగుతున్నారని హర్యానా సర్కారు గట్టిగా నమ్మే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana  girl schools  above 50  teachers  

Other Articles