కశ్మీర్ యువత బరితెగింపు... 36 మంది దుర్మరణం | 36 died in Kashmir clashes

36 died in kashmir clashes against burhan encounter

Burhan encounter, jammu clashes

36 died in Kashmir clashes against Burhan encounter.

యువత బరితెగింపుతో 36 మంది మృతి

Posted: 07/14/2016 09:01 AM IST
36 died in kashmir clashes against burhan encounter

కశ్మీర్ కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో చెలరేగిన హింస ఉద్రిక్తంగా మారింది. ఏడు రోజులుగా కొనసాగుతున్న హింసలో చనిపోయిన వారి సంఖ్య 36కు చేరింది. అదే సమయంలో గాయాల కారణంగా ఆసుపత్రి పాలైన వారి సంఖ్య కూడా 2 వేలను దాటిపోయింది.

బుర్హాన్ అనుకూలురుగా రోడ్డెక్కుతున్న కశ్మీర్ యువత ఏకంగా పోలీస్ స్టేషన్లపైనే రాళ్లు విసురుతున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. అయినా యువత మాత్రం పోలీసుల తూటాలకు ఏమాత్రం బెదిరిపోవడం లేదు. పోలీసుల బుల్లెట్లకు దీటుగా పోలీస్ స్టేషన్లపైనే రాళ్లు రువ్వుతున్నారు. వెరసి అక్కడ పరిస్థితి రాను రాను మరీ ఘోరంగా తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Burhan encounter  Jammu Kashmir  youth  clashes  

Other Articles