Married woman beats lover with slippers for refusing to elope

Mother of 3 thrashes lover allegedly for refusing to elope

lady thrashed lover, mother of three thrashed lover, lady thrashed lover for refusal to elope, lover beaten for refused to elope, Patra village, Gajner, Kanpur, Extra Marital Affairs,Patra village,Circle Officer, uttarpradesh, crime

Enraged with her paramour's refusal to elope with her, a mother of three allegedly thrashed him up with slippers as cops looked on at a police station in Kanpur.

ప్రియుడ్ని చెప్పుతో కొట్టిన మహిళ.. భర్త షాక్..!

Posted: 07/13/2016 12:08 PM IST
Mother of 3 thrashes lover allegedly for refusing to elope

తనతో అక్రమ సంబంధం పెట్టుకుని.. లేచిపోయేందుకు అంతా సిద్దం చేసుకున్నాక చివరి నిమిషంలో అందుకు నిరాకరించిన ప్రియుడిపై ముగ్గురు పిల్లల తల్లైన ఓ వివాహిత చావచితక బాదింది. తనతో వస్తానని చివరి నిమిషంలో మనసు మార్చుకుని నిరాకరించిన ప్రియుడిని చెప్పుతో కొట్టింది. తన ఆశల పల్లకికి అలవాలమౌతాడని అశించిన మహిళ తన ప్రియుడిపై పోలిస్ స్టేషన్ లోనే. పోలీసులు చూస్తుండగా అమె తన ప్రియుడిపై అగ్రహాన్ని వెల్లగక్కింది. అక్రోశంతో ఊగిపోయింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజ్నర్ పట్టణానికి సమీపంలోని పత్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు సంతానం కలిగిన మహిళ తన పొరుగింట్లో ఉంటున్న బల్జీత్(30)తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. క్రమంగా ఇద్దరి అలోచనలు, భావాలు కలిసాయి. అక్రమ సంబంధాన్ని మరో ప్రాంతానికి వెళ్లి సక్రమంగా మార్చుకునేందుకు వారు నిర్ణయించుకున్నారు. అంతా సిద్దం చేసుకున్న తరువాత చివరి నిమిషంలో బల్జీత్ లేచిపోవడానికి నిరాకరించాడు.

అంతే నన్ను మోసం చేస్తావా అంటూ ఆ మహిళ ప్రియుడిపై విరుచుకుపడింది. లేచిపోవడానికి తాను ఒప్పుకోలేదని పోలీసులతో బల్జీత్ చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె మరోసారి అతడిని చితకబాదింది. కాగా బాధిత మహిళ కేవలం మౌఖికంగా పిర్యాదు మాత్రమే చేసిందని, కానీ రాతపూర్వక పిర్యాదు అందితేనే తాము నిందితుడైన బల్జీత్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలు పిర్యాదు చేస్తే నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేస్తామని కాన్పూర్(రూరల్) ఎస్పీ పుష్పాంజలి తెలిపారు. అయితే వివాహిత, ముగ్గురు పిల్లల తల్లైన బాధితురాలి భర్తకు అతని భార్య అక్రమ సంబంధం గురించి ఏ మాత్రం కూడా తెలియకపోయినా.. చివరకు అతనిసమక్షంలోనే ఇదంతా జరగడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baljeet  refused to elope  lover  mother of three  kanpur police  crime  

Other Articles