అమ్మాయిలే... బండ బూతులు తిడుతూ రచ్చ చేశారు | Women hurl abuse and objects at McDonald’s staff

Women hurl abuse and objects at mcdonald s staff

Women hurl abuse, Women fight with McDonald’s staff

Women hurl abuse and objects at McDonald’s staff.

ITEMVIDEOS: అమ్మాయిలే... బండ బూతులు తిడుతూ రచ్చ చేశారు

Posted: 07/13/2016 01:10 PM IST
Women hurl abuse and objects at mcdonald s staff

పువ్వులు, గాజు బొమ్మలు, అమ్మాయిలు సుకుమారంగా ఉంటే అందంగా ఉంటుంది. కానీ, ఇక్కడో ఉదంతం చూస్తే అదంతా తూచ్ అనుకుంటారు. ఓ ఫుడ్ కోర్టు సిబ్బందిపై ఇద్దరు ఆడాళ్లు చేసిన దౌర్జన్యం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగడం ఖాయం. బండ బూతులు తిడుతూ.. చేతికందిన సామాన్లు విసిరేస్తూ నానా రచ్చ చేశారు.

అమ్ స్టర్ డామ్ లోని ఓ మెక్ డోనాల్డ్ ఫుడ్ కోర్టు కు పొట్టి డ్రెస్సుల్లో వచ్చిన ఇద్దరు యువతులు ఫుడ్ ఆర్డర్ చేశారు. అది రాగానే ఓ మహిళ ఇంకో మహిళతో చెవిలో ఏదో చెప్పింది. అంతలో సిబ్బందిపై బూతు పురాణం అందుకున్నారు. చేతికి దొరికిన వస్తువులను వారిపైకి విసిరేశారు. ప్రతీగా కౌంటర్ పై ఉన్న వ్యక్తి కూడా అదే పని చేశాడు. మరికొంత మంది సిబ్బంది వచ్చినా వారిపైకి విసిరడటం ప్రారంభించారు.

చివరకు క్యాష్ కౌంటర్లో చేయి పెట్టబోతున్న వారిని మిగతా కస్టమర్లు ఆపగలిగారు. తాము చెల్లించే బిల్లు వెనక్కి ఇవ్వాలంటూ వారిద్దరు గొడవ చేశారు. చివరికి అక్కడి వారికి అర్థమైంది ఏంటంటే... వారిద్దరు తాగి ఉన్నారు. అంతేకాదు ఆ మత్తులో ఏం ఆర్డరో కూడా ఇచ్చారో తెలీని వారు ఒక దాని బదులు మరోకటి తెచ్చినందుకే గొడవపడ్డామని చెబుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అపులోకి తెచ్చి జస్ట్ ఓ వార్నింగ్ తో వారిద్దరిని వదిలేశారు. వీ యార్ నాట్ లవ్ ఇట్ అంటూ వారి చేసిన వీరంగాన్ని అక్కడే ఉన్న ఆకతాయిలు వీడియో తీసి నెట్లో పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amsterdam  women  MC Donald  abuse  fight  

Other Articles