కేంద్ర మంత్రిత్వ శాఖలో కేటీఆర్! | KTR first foreign minister of a state in India

Ktr first foreign minister of a state in india

KTR foreign minister, telangana first foreign minister

Telangana govt introduced foreign ministry in cabinet, KTR likely to the first minister.

కేంద్ర మంత్రిత్వ శాఖలో కేటీఆర్!

Posted: 07/12/2016 12:29 PM IST
Ktr first foreign minister of a state in india

మొన్నేగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఇంతలో ఇదేంటి? విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ మారబోతుందా? పైగా టీఆర్ఎస్ కు అప్పజెప్పబోతున్నారా? అది కూడా కేటీఆర్ కేనా అని జుట్టు పీకోకండి. అసలు విషయం తెలిస్తే... మీరే ఆశ్చర్యపోతారు.

విదేశీ వ్యవహారాలను పూర్తిగా పర్యవేక్షించేంది కేంద్రమే. అలాంటి శాఖను ఇంతవరకు ఏ రాష్ట్రం తమ కేబినెట్ లో ప్రవేశపెట్టలేదు. కానీ, త్వరలో తెలంగాణలో విదేశీ వ్యవహారాల శాఖ రాబోతుంది. తొలి ఫారిన్ మినిస్టర్ బాధ్యతలను సీఎం కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కే అప్పజెప్పబోతున్నారంట. ఉత్తమ పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా రూపొందించడానికి ఈ మంత్రిత్వశాఖ ఉపయోగపడుతుందన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఐటీ మంత్రిగా కేటీఆర్ వరుస విదేశీ పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ఆ సమయంలో ఎన్నారై లతో పెట్టుబడుల గురించి, కంపెనీల ఏర్పాటు గురించి వరుస చర్చలు చేయటంతోపాటు, ఎన్నారై పాలసీ విధానాన్ని అమలు చేయటంలో కృషి చేశాడు. దీంతో ముచ్చటపడిపోయిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఓ ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అది గనక జరిగితే దేశంలోనే ప్రాంతీయ విదేశీ వ్యవహారాల మంత్రిగా కేటీఆర్ రికార్డులకెక్కటంతోపాటు, ఆ శాఖను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  IT minister KTR  foreign minister  KCR  

Other Articles