Woman, juvenile charge each other with forced sex, get booked

Woman juvenile charge each other with forced sex get booked

Forced sex, Juvenile, Minor boy, POCSO Act, Facebook for sex, Facebook, viral news, Vasant Kunj area, zinda, romance, molestation case, crime

A 17-year-old boy entered a physical relationship with a 26-year-old woman who met him on Facebook. Later, they charge each other of forced sex and filed complaints.

రా.. రమ్మని పిలిచింది.. వంచించి.. పట్టించింది..

Posted: 07/12/2016 12:30 PM IST
Woman juvenile charge each other with forced sex get booked

సోషల్ మీడియాకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని తెలిసివచ్చింది ఓ బాలుడికి. అదేంటి అంటారా.? నిజమండీ.. సోషల్ మీడియా ఎంతటి వారినైనా తన కబంధ హస్తాలలోకి లాక్కుని తాత్కాలిక సుఖాలను అందిస్తుంది. వాటిని అస్వాధించే లోపే కష్టాలను తెచ్చిపెడుతుంది. అయితే కేవలం తమ పని తాము చూసుకుంటామనుకున్న వారికి మాత్రం సామాజిక మాద్యమం మిత్రడే. అయితే చెడు సావాసాలు చేసేవారికి మాత్రం ఇదో నరకం అని కొద్దిగా అలస్యంగానైనా తెలుస్తుంది. అదెలా అంటారా..?

నిత్యం ఫేస్బుక్లో మునిగిపోయే ఓ  17 ఏళ్ల బాలుడికి అనుకోకుండా ఓ మహిళతో పరిచయమైంది. ఫేస్బుక్లో 'జిందా' పేరుతో ఉన్న 26 ఏళ్ల మహిళతో చాటింగ్ లో మునిగి తేలుతూ పరిచయం పెంచుకున్నాడు. ప్రతిరోజు అమెతో చాటింగ్ చేసి చేసి క్రమంగా ఫేస్ బుక్ దాటి పరిచయాలు బలపడ్డాయి. అయితే తనతో ఏకాంతంగా గడపటానికి రావాలని ఆ బాలుడ్ని మహిళ కోరింది. దీంతో యువకుడు ముందువెనుక అలోచించకుండా వచ్చి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. అదెలా అంటే వారు మైమరచి ఒకరి కౌగిలిలో మరోకరు బంధీలుగా మారిన తరుణంలో అక్కడికి పోలీసులు వచ్చారు.

పోలీసులకు సమాచారం అందడంతోనే వారు అక్కడికి వచ్చారు. వారికి సమాచారం ఇచ్చిందెవరు..? అంటే జిందా అనే మహిళ. ఓ 17 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారం చేశాడని అమె పోలీసులకు తన ఫోన్ ద్వారా పిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని అరెస్టు చేశారు. అయితే సదరు మహిళ తనను రమ్మని బలవంతం చేయడంతోనే తాను హోటల్ లోకి వచ్చానని, తానే బలవంతంగా శారీరికంగా ఒక్కటవుదామని బలవంతం చేసిందని బాలుడు పోలీసులకు చెప్పాడు. తాను తిరస్కరించినా పదేపదే అడగడంతో కాదనలేక వచ్చానని పోలీసులతో బాలుడు చెప్పాడు.

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటళ్లో జరిగిన ఈ ఘటన.. టీవీలో క్రైమ్ డ్రామాను మరిపించేలా ఉందని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె హఠాత్తుగా పోలీసులకు ఫోన్ చేసింది. తనపై అతడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిపై అత్యాచారం కింద, మహిళపై 'పోస్కో' చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా 'హనీట్రాపింగ్'లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : juvenile  Vasant Kunj area  forced sex  Zinda  crime  

Other Articles