అమ్మ ఇంట్లో బాంబు పెట్టింది ఎవరంటే... | 14 years boy bomb threat call to cm jayalalitha's house

14 years boy bomb threat call to cm jayalalitha s house

Jayalalitha Fake Call, Bomb threat call to TN CM

Fake Bomb threat call for Tamilnadu CM jayalalitha's Home. Police areested 14 years boy at mannakaram.

అమ్మ ఇంట్లో బాంబు పెట్టింది ఎవరంటే...

Posted: 07/11/2016 05:37 PM IST
14 years boy bomb threat call to cm jayalalitha s house

తమిళనాడు రాజధాని చెన్నై ఒక్కసారిగా హడలిపోయింది. సాధారణంగా షాపింగ్ మాల్ లకు, లేక ఏ కార్యాలయాలకో బాంబు బెదిరింపు కాల్స్ రావటం మనం చూస్తుంటాం. ఇక్కడ ఓ ఆంగతకుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ ఫోన్ చేసి పరుగులు పెట్టించాడు.

సోమవారం ఉదయం చెన్నై సిటీ పోలీస్‌ కంట్రోల్‌ రూంకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగమేఘాల మీద జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లో అణువణువు గాలించారు. అనంతరం అదంతా ఉత్తదేనని గ్రహించారు. అయితే దానిని లైట్ తీసుకోకుండా ఇంటికి భద్రతను పెంచారు. ఇక వచ్చిన కాల్ పై దర్యాప్తు చేపట్టగా విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు.

అప్రమత్తమైన పోలీసు బృందాలు మరకణ్ణం చేరుకుని, ఆగంతకుడి కోసం గాలించారు. చివరికి ఎలాగోలా అతడిని పట్టుకున్నాయి. అది చేసింది భువనేశ్వరన్ అనే 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించగా, కేవలం సరదా కోసం అలా చేశానని చెప్పుకోచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu  Jayalalitha  fake call  bomb threat  

Other Articles