ఇర్ఫాన్ ఖాన్ సినిమాలో ఆ సీఎం హీరోనట! | Lalu prasad lead role in Hindi film to be produced by Irfan Khan

Lalu prasad wants lead role in biopic to be produced by irfan khan

lalu in madari promotion, Lalu prasad wants to lead role in movie, lalu prasad with irfan khan

Lalu prasad wants to lead role in his auto biography film and to be produced by Irfan Khan.

ఇర్ఫాన్ ఖాన్ సినిమాలో ఆ సీఎం హీరోనట!

Posted: 07/09/2016 09:19 AM IST
Lalu prasad wants lead role in biopic to be produced by irfan khan

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన చేష్టలతో, ప్రకటనలతో తరచూ వార్తల్లోకి ఎక్కతుంటాడు. గడ్డి స్కాంలో జైలుకి వెళ్లొచ్చిన ఈ మాజీ సీఎంగారు పలు సందర్భాల్లో తనకు తానే గొప్ప నటుడిగా పేర్కొన్నాడు కూడా. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదని అప్పుడప్పుడు అంటుంటాడు కూడా. ఇక ఇప్పుడు ఆ బాధ్యతలను నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు అప్పజెప్పాడు.

నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్వీయంగా నిర్మించిన నటించిన మాదారి చిత్ర ప్రమోషన్ సందర్భంగా లాలూని ఆయన ఇంటి వద్ద కలిసాడు. ఈ సందర్భంగా లాలూ మీడియాతో మాట్లాడుతూ... సినీ స్టార్లతో పోలిస్తే తానెంతమాత్రమూ తక్కువ కాదని, తన జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే అందులో తానే ప్రధాన పాత్ర పోషిస్తానని అన్నారు. ‘‘హమ్ కిసీ స్టార్ యాక్టర్ సే కమ్ హై క్యా(స్టార్ యాక్టర్ కంటే నేనేమైనా తక్కువా?). నా జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే నటిస్తా. ప్రధాన పాత్రను నేనే పోషిస్తా’’ అని పేర్కొన్నారు.

అయితే నిర్మాతగా వ్యవహరించడంతోపాటు హీరోయిన్‌ను వెతికే బాధ్యత మాత్రం ఇర్ఫాన్‌దేనని వ్యాఖ్యానించి నవ్వులు కురిపించారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదని, తన అభిమాన హీరో దిలీప్ కుమార్ అని వివరించారు. వైజయంతిమాల, హేమమాలిని తదితర నటీమణులు అంటే ఇష్టం ఉండేదన్నారు. హాస్య నటుల్లో జానీ వాకర్ అంటే ఇష్టమని లాలూ చెప్పారు కూడా. గతంలో ‘పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్’ అనే సినిమాలో లాలూ నటించిన విషయం తెలిసిందే. అంతేనా ఆయనగారి పెద్ద కుమారుడు, ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో ఓ భోజ్ పురి సినిమాలో హీరోగా చేయగా, అందులో కూడా లాలూ సీఎం పాత్ర పోషించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  former CM  lalu prasad  Irfan khan  madari  

Other Articles