Burqa ban comes into force in Switzerland

Switzerland enforces burqa ban

Switzerland,burqa ban,Ticino, Middle East, Lugano, Locarno, Magadino,Muslim, Switzerland enforces burqa ban, news,

Fines of up to $10,155 would be imposed for anyone breaking the rules, although the minimum fine would be closer to $100

అ దేశ నిర్ణయంపై ముస్లిం మహిళల హర్షం..

Posted: 07/09/2016 09:20 AM IST
Switzerland enforces burqa ban

స్విట్జర్లాండ్‌లో పార్లమెంటు అమోదించిన కొత్త చట్టంపై అదేశంలోని ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము ముసుగులు ధరించి తిరగాల్సిన అవసరం లేదు. తమ ముఖాలను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. అదేనండీ ఇన్నాళ్లు తమ మతం చాటున అందమైన ముఖాలను బురఖాతో కప్పిపుచ్చుకునే అవసరాన్ని నిషేధిస్తూ స్విస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో మాత్రం కాదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో ముఖం కనిపించకుండా బురఖా ధరించడాన్ని స్థానిక ప్రభుత్వం నిషేధించింది. గతంలో ఈ విషయమై నిర్వహించిన రెఫరెండంలోనూ అక్కడి మహిళలు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పునిచ్చారు.

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. కనిష్టంగా 7,800 రూపాయలను, గరిష్టంగా 7.85లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నూతన చట్టం తీసుకొచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాల్లో ఎవరూ ముఖం కనిపించకుండా బురఖా ధరించకూడదని, జూలై ఒకటవ తేదీ నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని స్విడ్జర్లాండ్ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినో ప్రభుత్వం ప్రకటించింది. స్విస్ పర్యటన కోసం మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే ముస్లిం మహిళలను ఈ నిషేధ ఉత్తర్వులు ఇబ్బంది పెట్టనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం తమ దేశ పర్యాటకులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. టిసినో ప్రభుత్వ ఉత్తర్వుల గురించి వెల్లడించింది. లుగానో, లొకార్నో, మగదినో, బెల్లింజోన, మెండ్రిసియో ప్రాంతాల్లో ఈ నిషేధ ఉత్తర్వులు అమలవుతాయి.

బురఖాను నిషేధించే విషయమై 2013లోనే టిసినో ప్రభుత్వం రెఫరెండమ్ నిర్వహించింది. మూడింట రెండు వంతుల మంది ఓటర్లు నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. బురఖాలు, నిఖాబ్‌లతో పాటు ప్రదర్శనల సందర్భంగా ఆందోళకారులు ముఖాలకు గుడ్డలు కట్టుకోవడాన్ని నిషేధించాలని టిసినో ప్రభుత్వం భావించింది. అయితే బురఖాలు, నిఖాబ్‌లు నిషేధిస్తే చాలని ప్రజలు తీర్పు చెప్పారు. ఇలా ఓ రాష్ట్రం బురఖాను నిషేధిస్తూ చట్టం తీసుకరావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఏమీ కాదని కూడా స్విట్జర్లాండ్ పార్లమెంట్ స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో, కస్టమ్స్ కార్యాలయాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బురఖా నిషేధం గురించి ప్రయాణికులను ముందుగానే హెచ్చరిస్తారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : switzerland  Burka ban  Ticino state  Middle East  Lugano  

Other Articles