Dallas shooting: Obama cutత Europe trip short by one day

Five dallas police officers were killed by a lone attacker

dallas shooting, barack obama, black lives matter, police shootings, alton sterling, philando castile, police killed, david brown, follow-dallas

Following the death of the five police officers who were killed in a shooting Thursday, President Obama plans to cut his trip to Europe short by one day,

డల్లాస్ కాల్పుల ఘటన.. పర్యటనను కుదించిన ఒబామా

Posted: 07/09/2016 07:16 AM IST
Five dallas police officers were killed by a lone attacker

అమెరికాలోని డాలస్ నగరంలో ఇద్దరు నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా తన విదేశీ పర్యటనను కుదించుకున్నారు. ప్రస్తుతం ఆయన యూరోప్ లో పర్యటిస్తుండగా, డల్లాస్ ఘటన గురించి తెలిసి విచారం వ్యక్తం చేశారు. దీంతో ముందుగా సోమవారం వరకు ఆయన పర్యటన షెడ్యూలు ఖరారు చేసివుండగా ఆయన దానిని ఒక రోజు ముందుగానే ముంగించుకుని అమెరికాకు తిరిగిరానున్నారు. అదివారం స్పెయిన్ కు వెళ్లనున్న ఒబామా.. అక్కడి నుంచి నేరుగా అమెరికాకు తిరుగుపయనం కానున్నారు.

డల్లాస్ కాల్పుల ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో ఆరుగురు పోలీసులతో పాటు ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. డాలస్‌లోని అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో నల్లజాతీయులు నిరసన ప్రదర్శన సందర్భంగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుల మృతికి నిరసనగా మొదలైన నిరసనలు చివరకు రక్తపాతానికి దారితీశాయి.  9/11 దాడుల అనంతరం పోలీసులపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ కాల్పుల ప్రధాన సూత్రధారి మిఖా జాన్సన్(25) రోబో సాయంతో జరిపిన పేలుళ్లలో మరణించాడు.

తుపాకులతో దుండగులు కాల్పులు జరపడం వల్లే ఇది జరిగిందని డాలస్ పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ చెప్పారు. అయితే ఎంత మంది కాల్పులు జరపారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. చనిపోయే మందు అనుమానితుడు పోలీసులతో మాట్లాడుతూ... ఇటీవల నల్ల జాతీయులపై కాల్పుల వల్ల తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే తెల్లజాతి అధికారుల్ని చంపాలనుకున్నానని, తాను ఏ గ్రూపు చెందినవాడిని కానని, సొంతంగానే ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిపాడు. ‘నిరసనల సందర్భంగా గురువారం రాత్రి డాలస్‌లోని డౌన్‌టౌన్ ప్రాంతంలో ఇద్దరు నల్లజాతీయులు ఆకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపారు.

పోలీసులు దాన్ని ఉగ్రవాద చర్యగా మొదట పొరపడ్డారు. కాల్పులతో వందలాది మంది ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. ఇంతలో పోలీసులు ఒక అనుమానితుడ్ని చుట్టుముట్టి చాలా సేపు అతనితో చర్చలు జరిపారు. చర్చలు ఫలించపోవడంతో దుండగుడికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు పోలీసులు రోబోకు పేలుడు పదార్థం అమర్చి దుండగుడి వద్దకు చేర్చి పేల్చి వేశారు.’ అని పోలీసు చీఫ్ బ్రౌన్ తెలిపారు. ఇంకా అనుమానితులు చాలా మంది ఉండే అవకాశం ఉందని, అనుమానితులంతా కలసి పనిచేస్తున్నారని, దీంతో దర్యాప్తు అధికారులు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dallas shooting  Police  Barrack Obama  Nato Summit  Europe Trip  Spain  

Other Articles