Molestation complaint against singer Mika Singh

Model accuses popular singer of molestation

mika singh, mika singh controversy, mika singh booked, fir against mika singh, mika singh molestation case, mika singh molestation charges, mika singh molestation on fashion designer, entertainment

Bollywood singer Mika Singh was reportedly booked for molesting a fashion designer in Mumbai. The designer alleged that she had gone to his place and the singer misbehaved with her.

బుద్ది మారని బాలీవుడ్ సింగర్.. మోడల్ పై..

Posted: 07/06/2016 01:54 PM IST
Model accuses popular singer of molestation

సమాజంలో ఓ హాదా, గౌరవం వచ్చిన తరువాత వారు సెలబ్రిటీలుగా మారిపోతారు. అయితే పెలబ్రిటీలుగా మారిగానే వారిని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. అక్కడి నుంచి వారు తమ జీవితంలో చేసే ప్రతీ పనిని ఒకటికి రెండు పర్యాయాలు అలోచించి చేయాలి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చిన విమర్శలకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వారిపై విమర్శలు గుప్పించడానికి రెడీ అవుతారు. అయితే ఒకసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విమర్శల పాలైన బుద్దిమారకపోతే ఏమవుతుంది. విషయం కేసుల వరకు వెళ్తుంది.

ఇంతవరకు చెప్పిన ఉపోద్ఘతం అంతా బాలీవుడ్ సింగర్ మికా సింగ్ కు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే ఆయన దూదుడకు స్వభావంతో, కాస్తంత పోకిరీల మనస్తత్వతో అయన అనేక కేసులలో చిక్కుకున్నా.. ఇంకా తన బుద్దిని మాత్రం మార్చుకోవడం లేదన్న విమర్శలు వినపిస్తున్నాయి. ఆయన గతంలోనే పలు అభియోగాలను ఎదుర్కెంటున్న తరుణంలో మళ్లీ అదే తరహాలో నేరాలకు పాల్పడటం అయనకు ఇరకాటంలో పెడుతుంది. అయితే పదే పదే జర్వం బారిన పడే రోగి డాక్లరు అవసరం లేకుండానే మందులు కొని వేసుకున్నట్లు.. ఈయన కూడా తాను ఇరుకున్నే కేసులకు కౌంటర్ ను సిద్దం చేసుకుంటారన్న విమర్శలు కూడా వినబడతున్నాయి.

తనపై ఎన్ని విమర్శలు వస్తే అంత పాపులర్ అయినట్టు భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ.. తాజాగా మికా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మికా సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ మోడల్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మికా సింగ్  ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. బాలీవుడ్ కు చెందిన ఓ డిజైనర్ తరుచుగా మికా సింగ్ ఇంటికి వెళ్లొస్తుంటుందని, అయితే, ఇటీవల ఒకసారి వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, మోడల్ తనను డబ్బు కోసం బెదిరించిందని తాను ఇవ్వనని చెప్పడంలో అమె తనను వేధించడానికే కేసు నమోదు చేసిందని అతను కూడా కౌంటర్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మికా సింగ్ గత కొనేళ్లుగా ఎదుర్కోంటున్న ఇతర వివాదాలు:

గాయకుడు మికాసింగ్ తనపై లైంగిక దాడి చేశాడని అరోపిస్తూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆయనపై కేసు నమోదు చేసింది. 2006లో మికా సింగ్.. రాఖీ సావంత్ ను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో మండిపడ్డ రాఖీ సావంత్ అయనపై పోలీసులకు పిర్యాదు చేసి.. కేసు నమోదు చేయించింది. దీనికి కౌంటర్ గా అయన కూడా మరో కేసు పెట్టాడు. ముందుగా రాఖీ సావంత్ తనను ముద్దు పెట్టుకుందని, అయితే తాను తిరిగి ముద్దు పెట్టానని అంతేకాని, తానే ముందుగా ముద్దు పెట్టలేదని అయన కౌంటర్ కేసు నమోదు చేశాడు.

జరిగిన ఘటనతో బుద్ది తెచ్చుకుని మారాల్సిన మికా సింగ్ ఆ తరువాత కూడా అదే తరహా వైఖరిని కొనసాగించాడు. 2011లో తన హమ్మర్ కారుతో అటోరిక్షాను ఢీకోట్టాడు. అటోరిక్షా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కానీ కారు తాను నడపలేదని మికా సింగ్ వాదించాడు. అయితే అక్కడితో అగకుండా కామోడీ నైట్స్ విత్ కపిల్ షోకు హాజరైన మికా సింగ్, తనకు బిపాషా ముద్ద పెట్టిందని అమె పెదాలకు వుండే లిప్ స్టిక్ తన బుగ్గలకు కూడా అంటుకుందని చెప్పాడు. దీంతో మండిపడ్డ బిపాషా అయనపై సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా మండిపడింది. దీంతో అ ముద్దు బిపాషా పెట్టింది కాదని, అలిసాగర్ పెట్టాడని తెలిపారు.

ఇక ఆ తరువాత గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో తాను చేస్తున్న ఓ లైవ్ కన్ సర్ట్ లో తన అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఢిల్లీ అప్తమాలజికల్ సోసైటీ అధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అయన తన లైవ్ కన్ సర్ట్ ఇచ్చేందుకు హజరైయ్యారు. కాగా స్టేజిపై కన్ సర్ట్ బిజీలో వుండగా తనను అన్వయించే పద్దతిని చేసిన అభిమానని స్టేజి పైకి పిలిచాడు. అతను రాగానే అంతే ఒక్కసారిగా అతని చెంప చెల్లుమనిపించాడు. అతను డాక్టర్ అయివుండి కూడా మికా సింగ్ చేతిలో చెంపదెబ్బ తినక తప్పలేదు. అయితే ఆ దెబ్బ కారణంగా తన చెవికి గాయం అయ్యిందని ఆ వైద్యుడు అరోపించాడు.

తాజాగా మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడి నట్టు అభియోగాలు ఎదుర్కోంటున్నాడు. తానోక సెలబ్రిటీ అంటూ మిగిసిపడుతున్న వారు.. వారు సెలబ్రిటీగా మారింది కేవలం అభిమానుల వల్లేనన్న నగ్నసత్యాని మర్చిపోతున్నారు. అభిమానలకు అదర్శప్రాయంగా వుండాల్సిన వారు కాస్తా నిస్సిగ్గుగా ఇలాంటి ఘటనలలో చిక్కుకుని అభియోగాలను ఎదుర్కోని తమ అభిమానులకు ఏం సందేశాలను ఇస్తారో వారికే తెలియాలి. సెలబ్రిటీ కాగానే తామేం చేసినా చెల్లిపోతుందన్న భ్రమల నుంచి వారు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్న సూచనలు కూడా వినబడుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : designer  Mika Singh  molestation  crime  

Other Articles