ఈ రక్తసంబంధం కంటతడి పెట్టించకమానదు | Sister jumps into brother pyre in Rajasthan

Sister jumps into brother pyre in rajasthan

Sister jumps into brother pyre, Rajasthan sister jumps into pyre

Sister jumps into brother pyre in Rajasthan.

ఈ రక్తసంబంధం కంటతడి పెట్టించకమానదు

Posted: 07/02/2016 01:49 PM IST
Sister jumps into brother pyre in rajasthan

ఇంత వరకు అన్నా చెల్లెల అనుబంధం కళ్లకు కనిపించేట్లు సినిమాలే మనం చూసి ఉన్నాం. కానీ, ఇక్కడ జరిగిన ఓ ఉదంతం వింటే అయ్యో అనుకోక ఉండలేం. తన అన్న అంటే అమితమైన ప్రేమను చంపుకోలేని ఓ యువతి ప్రాణ త్యాగం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌‌ పట్టణం సతీరాంపూర్‌ లో వేల రామ్ మనత్(32) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచిన దుర్గను(28) ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ, కొన్నేళ్లకు ఆమె మతిస్థిమితం కోల్పోయింది. దీంతో ఇద్దరు పిల్లలను తానే ఉంచుకుని భర్త ఆమెను వదిలేయగా, అన్న మాత్రం ఆమెను అక్కున చేర్చుకున్నాడు. పసిపాపలా ఆమెను చూసుకున్నాడు. ఆ పరిస్థితిలో కూడా దుగ్గ ఒక్క మనత్ ను తప్పా ఎవరినీ గుర్తించేది కాదు. అంతలా ఉండేది వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు.

ఇక గురువారం రాత్రి దుంగార్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చితిపై మృతదేహం సగం కాలుతుండగా కుటుంబ సభ్యులు శ్మశానం నుంచి ఇంటికి బయలుదేరారు. కానీ, రామ్ సోదరి దుర్గ (28) అక్కడే ఉండిపోయింది. తన అన్న లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె ఒక్కసారిగా చితిపైకి దూకింది. దీనిని చూసిన ఓ 14 ఏళ్ల బాలుడు విషయాన్ని గ్రామస్తులకు చెప్పటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే దుర్గ దేహం సగం కాలిపోయింది. ఆమె మృతదేహాన్ని చితి నుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అన్న చనిపోయిన బాధలో ఉన్న తమకు దుర్గ ఇలా వదిలేసి వెళ్లిపోవటం మింగుడు పడటం లేదని మరో సోదరుడు దినేశ్ రోదిస్తూ చెబుతున్నాడు. ఈ అన్నచెల్లెల రక్తసంబంధాన్ని చూసి ఆ గ్రామం అంతా ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  sister  brother  pyre  

Other Articles