Priyanka Chopra unveils the controversial mag cover, talks about Quantico, Baywatch and Deepika

Priyanka chopra laughs off armpit troll in true diva style

priyanka chopra, deepika padukone, priyanka, baywatch, priyanka armpit, priyanka magazine launch, priyanka chopra hollywood, priyanka baywatch, priyanka quantico, priyanka chopra news, entertainment news

Actress Priyanka Chopra, who has managed to carve a niche for herself in the West with her TV show Quantico and her upcoming Hollywood debut film Baywatch

ITEMVIDEOS: బాలీవుడ్ నటి.. కవర్ పేజీపై బోల్డ్ గా.. బోలెడంత కాంట్రవర్సీ..

Posted: 07/01/2016 06:47 PM IST
Priyanka chopra laughs off armpit troll in true diva style

బాలీవుడ్ తారలకు ఈ మధ్య కాంట్రవర్సీలోకి అడుగుపెట్టడం కామన్ అయ్యింది. ఎంత కాంట్రవర్సీ వుంటే అంత రిప్యూటేషన్ వస్తుందని అనుకుంటున్నారో ఏమో గానీ.. ఎలాగైతేనేం వివాదాల్లో చిక్కకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన ఫోటోతో కాంట్రవర్సీకి తెరలేపింది. మ్యాగ్జిమ్ 100వ ఎడిషన్ కోసం ప్రియాంక ఇచ్చిన స్టిల్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. మాగ్జిమ్ కవర్ పేజీపై ప్రియాంక చోప్రా ఒక బోల్డ్ పోజిచ్చింది. సినిమాల్లో నటించాల్సిన నటీమణులు ఇలా ప్రతికల కోసం ఒంటి అందాలను అరబోయడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ మరో విషయమేమిటంటే మ్యాగ్జిమ్ కవర్ పేజీ ఆవిష్కరణను కూడా అమె తన చేతుల మీదుగా లాంచ్ చేసింది.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక తన స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. మోనిషా జైసింగ్ రూపొందించిన నేవి బ్లూ గౌన్ లో ఈ వేడుకకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా తన హాలీవుడ్ తొలి చిత్రం  'బేవాచ్' గురించి ముచ్చటించింది. 'బాజీరావు మస్తానీ'లో తన సహనటి అయిన దీపికా పదుకొణేతో తన 'ఈక్వెషన్స్' బాగానే ఉన్నాయని, తాము ఇప్పటికీ మంచి స్నేహితులమేనని ప్రియాంక చెప్పింది. అయితే హలీవుడ్ లో తనకన్నా దీపికకు మంచి ఆఫర్లు వస్తుండటంపై మాత్రం స్పందించడానికి నిరాకరించింది. ఒకరికి వస్తున్న ఆఫర్ల గురించి నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం నాకు లేదంటూ ప్రియాంక తోసిపుచ్చింది. కాగా, మాగ్జిమ్ కవర్ పై ప్రియాంక బోల్డ్ పోజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  controversial mag cover  Quantico  Baywatch  Deepika padukune  

Other Articles