Money owned by Indians in Swiss banks drops to record low of Rs 8,392 crore

Indian money in swiss banks has dropped to a 20 year low

Indians swiss deposits, indian swiss money, Swiss banks, Rs 8, 392 crore, Switzerland, swiss banks, swiss accounts, black money, india, swiss banks, black money india, illicit funds, arun jaitley, finance ministry, switzerland

The drop in numbers is significant as the Narendra Modi government has stepped up efforts both at the domestic and diplomatic level.

అక్కడ నల్లధనకుబేరుల నిల్వలు తగ్గాయట.. మరెక్కడికెళ్లాయో..?

Posted: 07/01/2016 01:14 PM IST
Indian money in swiss banks has dropped to a 20 year low

స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు తగ్గిపోయిందట. దాదాపు మూడోవంతుకు పడిపోయి, కనిష్ట స్థాయిలో రూ.8,392 కోట్లగా నమోదయిందట. తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఎన్ఎన్ బీ(స్విస్ నేషనల్ బ్యాంకు) విడుదల చేసిన రికార్డులో ఈ విషయం వెల్లడైంది. 1997 నుంచి ఆల్ పైన్ నేషన్ స్విస్ బ్యాంకులో దాచిన నగదును పబ్లిక్ గా తీసుకురావడం జరుగుతోంది. వరుసగా ఈ రెండేళ్ల నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఫండ్లు క్షీణిస్తూ వస్తున్నాయి.

2006 చివరిలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు ఫండ్ లు రికార్డు స్థాయిలో రూ.23,000 కోట్లగా నమోదయ్యాయి. ఆ తర్వాత 2011,2013 ఏళ్లను మినహాయిస్తే మిగిలిన ఏళ్లలో ఈ ఫండ్ లు కొంతమేర తగ్గాయి. నల్లధనంతో భారత్ చేస్తున్న పోరాటానికి స్విస్ సహకరిస్తూ వస్తోంది. ఈ సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది. 2018 నుంచి ఆటోమేటిక్ ఇన్ ఫర్మేషన్ ఎక్సేంజ్ పై స్విస్ సంతకం చేసే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాక భారత అధికారులు స్విట్జర్లాండ్ లో త్వరలోనే సందర్శించబోతున్నారట.

ఈ పర్యటనలో భాగంగా స్విస్ బ్యాంకులోని అనుమానిత ఇండియన్ అకౌంట్ల ఫెండింగ్ సమాచారాన్ని స్విస్ అథారిటీలను కోరనున్నారు. అయితే వేల కోట్ల రూపాయలను నలధన కుబేరులు మరెక్కడైనా దాస్తున్నారా.? అన్న అనుమానాలకు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రతీ భారతీయుడికి మూడు లక్షల రూపాయలు వచ్చే విధంగా వున్న నల్లధన కుబేరుల నిల్వలు.. స్విస్ నుంచి మాయమై.. ఎక్కడకు వెళ్లాయన్న విషయమై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇప్పటి వరకు కేవలం మూడు వేల పైచిలుకు కోల్ల రూపాయలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం నల్లధన కుబేరుల నుంచి రాబట్టింది. దీంతో నగదు నిల్వలు ఎటువైపు పయనం సాగించాయన్న విషయమై కూడా అరా తీయాలని భారతీయులు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ కు చెందిన వారి నగదు నిల్వలు స్విస్ బ్యాంకుల్లో అమాతంగా పెరుగుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ లో నల్లధన కుబేరులపై విమర్శలు పెరుగుతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో బంగ్లాదేశీయుల నిల్వలు 2014లోతో పొల్చితే గత ఏడాది 2015లో 9శాతం అధికంగా వున్నాయని సమాచారం.
 
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian money  Swiss banks  Rs 8  392 crore  Switzerland  

Other Articles