మలాలలోని చీకటి కోణం తెలుసుకోండి | How Malala becomes Millionaire Within short time

How malala becomes millionaire within short time

Nobel Laureate Malala, Malala in Millionaire club, Malala becomes millionaire with book sales, lectures

Nobel Laureate Malala Yousafzai Becomes Millionaire With Book Sales, Lectures

మలాలలోని చీకటి కోణం తెలుసుకోండి

Posted: 06/30/2016 12:11 PM IST
How malala becomes millionaire within short time

తాలిబాన్ తుటాలకు ఎదురొడ్డి నిలిచి బాలికా విద్య కోసం కృషి చేసిన వీరబాలిక మలాలా యూసుఫ్ జాయ్ గుర్తుంది కదా. చిన్నవయసులో ఆమె చేసిన ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏకంగా నోబెల్ శాంతి బహుమతిని కట్టబెట్టాయి. కొన్ని దేశాల స్కూల్ పుస్తకాలలో కూడా ఆమె చేసిన సాహస చర్యల గురించి పాఠాలుగా చేర్చుకున్నాయి. అయితే పేద కుటుంబం నుంచి వచ్చిన మలాల గురించి ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.

ప్రస్తుతం లగ్జీరీ లైఫ్ తో ఆమె తెగ ఎంజాయ్ చేస్తోంది. పూటకు సరిగ్గా తిండి కూడ లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలిక ప్రస్తుతం మల్టీమిలినియర్ జాబితాలోకి చేరిపోయింది. మరి అంత డబ్బు ఆమెకు ఎక్కడిదన్న అనుమానం రాకమానదు కదా. అందుకోసం ఆరా తీసిన వారి కోసం ఓ బ్రిటన్ పత్రిక వివరాలను అందజేసింది.

కేవలం ప్రసంగాలు, పుస్తకాల ద్వారా 18 ఏళ్ల మలాల కోట్లు వెనకేసిందట. ప్రసంగాల పేరిట సౌకర్యాలు, కోట్లు ఆమె ఖాతాకి చేరిపోతున్నాయి. అంతేనా ఒక్కో పుస్తకం కోసం ఏకంగా రూ.కోటి తీసుకుంటోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాకేండా ‘ఐ యామ్ మలాలా’ పేరిట ఆమె రాసిన పుస్తకం 18 లక్షల కాపీలు అమ్ముడుపోగా, తద్వారా రూ.20 కోట్ల మేర ఆదాయం ఆమెకు సమకూరింది.

అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులు సభ్యులు ప్రచురణ సంస్థ సభ్యులుగా ఉన్నారంట. దీంతో బయటివారికి వాటా పోకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఓవైపు ఐరాస సైతం ఈ పాక్ బాలిక గురించి గొప్పగా ఉపన్యాసాలు దంచుతుంటే ఆమె ఆ స్పీచ్ లతోనే కోట్లకు కోట్లు వెనకేసుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nobel Laureate  Pak girl  Malala  Millionaire  I a Malala  

Other Articles

Today on Telugu Wishesh