ఆడాళ్ల టాయ్ లెట్ లోకి దూరి ఏం చేశాడంటే... | man arrested for peeping into the ladies toilet in Bangalore

Man arrested for peeping into the ladies toilet in bangalore

man was arrested for peeping into the ladies washroom, peeping into the ladies washroom Bangalore, Bangalore man peeping washroom

A man was arrested for peeping into the ladies washroom in a restaurant in Bengaluru. A woman at the Vasudev Adigas’ Koramangala restaurant found him peeping in while she was using the restroom on Saturday. She shouted at him, but he had soon escaped. With the help of her friend, the woman informed the management and sought action. He was a staffer named Ghouse Sab. he was taken to the police station where he was arrested.

ITEMVIDEOS:ఆడాళ్ల టాయ్ లెట్ లోకి దూరి ఏం చేశాడంటే...

Posted: 06/30/2016 12:42 PM IST
Man arrested for peeping into the ladies toilet in bangalore

అది బెంగళూరులోని ప్రఖ్యాత వాసుదేవ్ అడిగా కోరమంగళ రెస్టారెంట్. నిత్యం కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. 20 ఏళ్ల యువతి తన స్నేహితురాళ్లతో కలిసి సరదాగా భోజనానికి అక్కడికి వచ్చింది. లంచ్ ముగిశాక వాష్ రూమ్ కి వెళ్లింది. అంతలో కెవ్వుమని కేక. ఏం జరిగిందోనని అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంతో బయటికి పరిగెత్తుకొచ్చిన యువతి టాయ్ లెట్ లోకి ఎవరో తొంగిచూడటాన్ని గమనించిందట. వెంటనే విషయాన్ని మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. హోటల్ లో పని చేసే ఓ సర్వర్ అటువైపుగా వెళ్లటం కొందరు చూశారంట. దీంతో అతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేం తెలీదని బుకాయించడంతో హోటల్ లోని సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించారు. అందులో అతగాడు లేడీస్ టాయ్ లెట్ వైపు వెళ్లటం క్లియర్ గా ఉంది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు.

గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆ యువతి అసలు కస్టమర్ కాదని, కేవలం వాష్ రూమ్ కోసమనే తమ హోటల్ కి వచ్చిందని హోటల్ మేనేజ్ మెంట్ చెబుతోంది. ఇది తెలిసి ఆమెను అడ్డుకునేందుకే తమ సర్వర్ ఆమె వెంట వెళ్లాడనే చెత్త వాదనను వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  restaurant  peeping  ladies washroom  

Other Articles

Today on Telugu Wishesh