Teen arrested for hacking model's social media accounts

Chhattisgarh teen arrested for hacking model s email fb account

hyderabad model, maharastra models, chhattisgarh boy, hacking, social media, facebook, Gmail, icloud, surajpur district, cyber crime, social media accounts, hacking, arrested, social media accounts news, hacking news, arrested news, cybercrime news, india news

A teenager from Chhattishgarh was today apprehended here for allegedly hacking the email and social media accounts of an aspiring model last month

మోడళ్లే అతని టార్గెట్.. వీడు పిల్లాడు కాదు పెద్ద కేటుగాడు..

Posted: 06/29/2016 10:32 AM IST
Chhattisgarh teen arrested for hacking model s email fb account

మోడలింగ్ రంగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న అందాల భామలే అతని టార్గెట్.. వారు భద్రంగా దాచుకున్న వ్యక్తిగత ఫొటోలు.. వీడియోలను హ్యాక్ చేసి అనందించడం అతని దినచర్య. అయితే ఏదో సరదాగా ఇలా చేస్తున్నాడని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ పిల్లాడు.. కాదు కాదు కేటుగాడు హ్యాకింగ్ కేసులో అరెస్టుయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మోడళ్ల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసిన కేసులో మహా పోలీసులు ఇతగాడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా ఇతగాడి బుద్దిమారలేదు. మళ్లీ అదే పని చేసి అడ్డంగా దోరికిపోయి.. కటకటాలు లెక్కపెడుతున్నాడు.

మోడలింగ్ రంగంలో ఒక వెలుగు వెలగాలిని ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న నగర మోడల్‌కు తాను దాచుకున్న పోటోలు తన మోబైల్ కు రావడంతో కంగారు పడింది. దీంతో సైబరాబాద్ పోలీసులను అశ్రయించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌ కుర్రాడు ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డాడని తెలిసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేశారు. సరదా కోసం హ్యాకింగ్‌.. మోడళ్ల అకౌంట్లే టార్గెట్‌. ఫిషింగ్‌ మెసేజ్‌ పంపుతాడని, గుట్టుచప్పుడు కాకుండా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను పట్టేసి.. అకౌంట్లను ఓపెన్‌ చేసి పాస్‌వర్డ్‌లను మార్చేస్తాడని  పోలీసుల విచారణలో తేలింది. అయితే నిందితుడు ఐటీ ప్రొఫెషనలో, పేరు మోసిన హ్యాకరో కాదు.. కేవలం ఓ టీనేజర్‌.

హైదరాబాద్‌కు చెందిన ఓ వర్ధమాన మోడల్‌ ఫేస్‌బుక్‌, జీమెయిల్‌ ఐక్లవుడ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశాడు. దీంతో బెంబేలెత్తిపోయిన మోడల్ పరుగుపరుగున వెళ్లి పోలీసులను అశ్రయించింది. అంతే వారు కూడా అంతే స్పీడుగా నిందితుడిని పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌ జిల్లాకు చెందిన అతడు హైదరాబాద్‌ మోడల్‌ జీమెయిల్‌కు ఫిషింగ్‌ మెసేజ్‌ పంపాడు. ఆమె దాన్ని ఓపెన్‌ చేసింది. ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదుచేసింది. కొద్ది నిమిషాల్లోనే ఫేస్‌బుక్‌, ఐక్లవుడ్‌ నుంచి ఆమెకు సందేశాలు వచ్చాయి. ఎవరో అకౌంట్‌ హ్యాక్‌ చేసినట్టు గుర్తించింది. కొన్ని రోజుల తర్వాత ఏకంగా ఫేస్‌బుక్‌, ఐక్లవుడ్‌ అకౌంట్ల లింక్డ్‌ జీమెయిల్‌ ఐడీ, సెల్‌ నెంబర్‌ను హ్యాకర్‌ మార్చాడు.

రెండు వారాల తర్వాత గుర్తుతెలియని నెంబర్‌ నుంచి మోడల్‌ సెల్‌ నెంబర్‌కు ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను వాట్సప్‌ ద్వారా పంపాడు. దీంతో ఖంగుతిన్న మోడల్‌ ఫేస్‌బుక్‌, జీమెయిల్‌ అకౌంట్లను హ్యాక్‌ చేసింది ఒకరే అని గుర్తించింది. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌, ఎస్‌ఐ ఆశిష్‌రెడ్డి ఏసీపీ జయరాం సారథ్యంలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ కుర్రాడు గతంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మోడళ్ల అకౌంట్లను హ్యాక్‌ చేశాడు. హ్యాక్‌ చేయడం ఎలా? అని ఇంటర్‌నెట్‌లో వెతికి హ్యాకింగ్‌కు పాల్పడ్డాడు. కేసును ఛేదించిన సైబర్‌ క్రైం పోలీసులను కమిషనర్‌ సీవీ ఆనంద్‌, క్రైమ్స్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాసరెడ్డి అభినందించారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles