will make my promise to minorities to come true very shortly

Minorities reservation will be increased to 12 percent

iftar party, CM KCR, election promise, 12 percent reservation, MIM MP Asaduddin owasi, mahamood ali, minority reservations, Telangana

Telangana CM KCR says will make his election promise to minorities, increasing minorities reservation quota to 12 percent to come true very shortly

మైనారిటీలకిచ్చిన మాటపై వెనక్కు తగ్గను..

Posted: 06/27/2016 11:58 AM IST
Minorities reservation will be increased to 12 percent

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు ఇచ్చిన ఎన్నికల హామీపై ఎట్టిపరిస్థితుల్లో వెనక్కు తగ్గనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే వారికిచ్చిన మాట ప్రకారం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ‘నా మాటంటే మాటే. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తా. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం ఎంక్వైరీ కమిటీ వేశాం. కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ముస్లిం రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఢిల్లీకి పంపిస్తామని అన్నారు.
 
ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విజయం సాధిస్తామన్న ధీమా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం విద్యార్థుల కోసం రూ. 390 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 120 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ముస్లింల పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
 
తెలంగాణలో హిందూ ముస్లింల సమైక్యతకు సంబంధించి ఒకనాటి గంగాజమున తెహజీబ్ ప్రపంచ ఖ్యాతి గడించిందని, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను గ్రహించి ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 200 మసీదుల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుల్లో లక్ష మంది ముస్లింలు ఆనందోత్సవాలతో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 కోట్లు కేటాయించిందని సీఎం చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles