తెలంగాణ హీరోను ఎత్తికెళ్లిపోయారు | Telangana lost Hero plant to Andhra

Telangana lost hero plant to andhra

Telangana, heropalnt, andhrapradesh, hero plant in Chitoor,

Telangana lost Hero plant to Andhra Pradesh

తెలంగాణ హీరోను ఎత్తికెళ్లిపోయారు

Posted: 06/25/2016 01:38 PM IST
Telangana lost hero plant to andhra

అభివృద్ధే కాదు అన్నింట్లోనూ తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంటోంది. ఇప్పటి దాకా నీటి వాటాలపై కొట్టుకుంటున్న రాష్ట్రాలు, ఇప్పుడు కంపెనీలను లాక్కోవటంపై దృష్టిసారిస్తున్నాయి. పారిశ్రామిక సంస్థల ఆకర్షణలోనూ ఒకదానిపై మరోకటి పైచేయి సాధిస్తూ కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక కంపెనీని తన్నుకుపోవటం ద్వారా ఏపీ తెలంగాణను దెబ్బతీసింది.

‘హీరో మోటో కార్ప్’ కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటార్ సైకిళ్ల ప్లాంటును చేజిక్కించుకోవడంలో ఏపీ సక్సెస్ అయ్యింది. తెలుగు నేలపై ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిన ‘హీరో మోటో కార్ప్’ యాజమాన్యం ముంజాల్ గ్రూప్ తొలుత తెలంగాణ సర్కారును సంప్రదించింది. ఈ క్రమంలో ఆ సంస్థకు రెడ్ కార్పెట్ పరచిన తెలంగాణ సర్కారు హైదరాబాదు సమీపంలోని మెదక్ జిల్లాలో స్థలం కేటాయింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రాయితీల విషయంలో తెలంగాణ సర్కారు నోరు విప్పలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఏపీ సర్కారు భూమితో పాటు రాయితీలు కూడా ఇస్తామని హీరో మోటో కార్ప్ కు సమాచారం పంపింది. అందుకు ఆసక్తి చూపిన ఆ సంస్థ ఏపీవైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేసినా హీరో ప్లాంటు ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో అందుబాటులో ఉన్న భూమిని ఆ సంస్థ ప్రతినిధులకు చూపింది.

అందుకు ‘హీరో’ ఓకే చెప్పడంతో 600 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ శుక్రవారం కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఏపీ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భూ బదలాయింపు విషయంలో చర్యలకు ఉపక్రమించారు. ‘హీరో’కు కేటాయించాల్సిన భూమికి సంబంధించిన ఒప్పంద పత్రాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆయన ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఈ ఒప్పందం పూర్తి కాగానే, ‘హీరో’ తన ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  heropalnt  andhrapradesh  

Other Articles