హిజ్రాతో ప్రేమ, పెళ్లి... ఆపై ఏం జరిగిందో చూడండి | man marriage transgender sensation in Karnataka

Man marriage transgender sensation in karnataka

Karnataka man marriage transgender, transgender marriage man, man marries transgender, shivakumar marraige radhika, హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు, హిజ్రాతో పెళ్లి, హిజ్రా జంటను విడదీసిన పెద్దలు, హిజ్రాతో ప్రేమ, పెళ్లి, తాజా వార్తలు, latest news, national news

Karnataka man marriage transgender. Couple Separated by bride family.

హిజ్రాతో ప్రేమ, పెళ్లి... ఆపై ఏం జరిగిందో చూడండి

Posted: 06/25/2016 02:51 PM IST
Man marriage transgender sensation in karnataka

ప్రేమకు మంచి మనసుంటే చాలు కులం, మతం, కలర్, ఆఖరికి వయసుతో పనేంటి అన్న డైలాగ్ లు బాగా విని విని ఉన్నాం కదా. కానీ, ఇక్కడో యువకుడు చేసిన పని చూస్తే లింగ బేధం కూడా అక్కర్లేదని మీరే ఒప్పుకుంటారు. ఓ హిజ్రా అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్న అతగాడి పే... ద్ద మనసుకు జనాలు జోహర్లు చెబుతున్నారు. కానీ. ఈ పెద్దోళ్లున్నారో... అతగాడి ప్రేమకు విలన్ లుగా మారారు.

కర్ణాటకలోని కోప్పక లో ఓ చిన్న టీస్టాల్ నడిపించుకుంటూ జీవిస్తున్నాడు శివకుమార్. అతగాడి దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు రోజు రాధిక అనే హిజ్రా వచ్చేది. ఇద్దరి మనసులు కలవటంతో పెళ్లికి సిద్ధమయ్యారు. హిజ్రా పెద్దల సమక్షంలో  ఈనెల 21న వీరిద్దరు ఒకటయ్యారు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. రెండు రోజుల తర్వాత రాథిక హిజ్రా అంటూ శివకుమార్ కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు.

అంతేకాదు శివకుమార్ ను లాక్కెల్లిన అతని తల్లిదండ్రులు ఐపీసీ సెక్షన్-377 హోమో సెక్సువాలిటీ కింద కేసు వేస్తామని రాధికను బెదిరిస్తున్నారంట. దీంతో ఆమె తరపున పలువురు హిజ్రాలు న్యాయపోరాటానికి దిగారు. అయితే తమ వంశవృక్షాన్ని అంతం చేయాలని రాథిక ప్రయత్నిస్తుందని శివకుమార్ తండ్రి చెబుతుంటే, పిల్లల గురించి చర్చించాకే పెళ్లికి సిద్ధపడ్డామని రాధిక చెబుతోంది/తున్నాడు. ఇక ఈ అటు ఇటు కానీ ఈ పెళ్లి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles