నగ్నడాన్స్ చేయని యువతిని ఏం చేశారో చూడండి | Dalit student forced to naked dance and pour toilet cleaner

Dalit student forced to naked dance and pour toilet cleaner

Dalit student drink toilet cleaner, nursing student naked dance, nursing student forced to nude dance, naked dance phnyl drink, ragging in karnataka nursing college, Kozhikode nursing student, నగ్నడాన్స్ చేయలేదని ఫినాయిల్, ఫినాయిల్ తాగించారు, యువతితో ఫినాయిల్ తాగించారు, నర్సింగ్ విద్యార్థిని నగ్ననృత్యం, ర్యాగింగ్ భూతం, కర్ణాటకలో ర్యాగింగ్, తాజావార్తలు, తెలుగు వార్తలు, latest news

In a shocking incident a Dalit student made to drink toilet cleaner as part of ragging in Karnataka. Girl suffered internal injuries and a surgery needed. Five students of a nursing college in Karnataka have been booked in connection with the alleged ragging of a first-year Dalit girl student, who has been hospitalised in Kozhikode with severe stomach problems, police said.

ITEMVIDEOS: నగ్నడాన్స్ చేయని యువతిని ఏం చేశారో చూడండి

Posted: 06/23/2016 03:48 PM IST
Dalit student forced to naked dance and pour toilet cleaner

కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో కర్ణాటకలో ర్యాగింగ్ భూతం మరోసారి పడగ విప్పింది. పొరుగు రాష్ట్రంలోని ఎక్కడో ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన యువతికి ర్యాగింగ్ పేరిట అవమానం జరగటంతోపాటు ప్రాణాల మీదకు వచ్చింది. బట్టలన్నీ విప్పి తమ ముందు నగ్నంగా డాన్స్ చేయాలని సీనియర్లు ఆదేశించారు. ఒప్పుకోకపోవటంతో ఆ దళిత యువతిపై దాష్టీకానికి పాల్పడ్డారు.

కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాళ్లోకి వెళ్లితే... కేరళకు చెందిన ఓ బీద కుటుంబానికి చెందిన బాధితురాలు(19) నర్సింగ్ కోసం కర్ణాటకలోని కలబుర్గి  కాలేజీలో చేరింది. కాలేజీకి వెళ్తున్న ఆమెపై సీనియర్లు దారుణానికి పాల్పడ్డారు. నగ్నంగా నృత్యం చేయాలని ఆదేశించగా, ఆమె దానికి నిరాకరించింది. దీంతో తీవ్రంగా కొట్టి, బాత్ రూం కడిగే క్లీనర్ ఫినాయిల్ ను ఆమె గొంతులో పోశారు. ఆ సన్నివేశాలను తమ ఫోన్ లో చిత్రీకరించి అందరికీ షేర్ చేశారు.

ఆమె పరిస్థితి విషమించడంతో తోటి విద్యార్థినిలు ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. అయితే కాలేజీ పరువుపొతుందన్న యాజమాన్యం ఆమెను ఆస్పత్రి నుంచి గెంటివేసేలా చేసింది. అంతేకాదు ఆత్మహత్యాయత్నం అంటూ దానికి రంగు పులుమింది. స్నేహితుల సాయంతో ఎలాగోలా కేరళ చేరుకున్న యువతి కోజికోడ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టాయ్ లెట్ క్లీనర్ తో ఆమె పేగులన్నీ పాడయిపోయినట్లు, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 విద్యార్థినులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

భాస్కర్   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalit student  nursing student  toilet cleaner  Karnataka Ragging  

Other Articles