లండన్ లో జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా? | jagan relax with playing golf in london tour

Jagan relax with playing golf in london tour

YS jagan mohan reddy news, jagan london tour, jagan golf playing, YSRCP news, AP politics, jagan london, jagan golf photos, jagan london photos, తాజా వార్తలు, లండన్ లో జగన్, జగన్ గోల్ఫ్, జగన్ వార్తలు, latest news

AP opposition leader YS jagan mohan reddy relax with playing golf in london tour.

లండన్ లో జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Posted: 06/23/2016 03:25 PM IST
Jagan relax with playing golf in london tour

ఓవైపు అధికార పక్షం ఆకర్ష్ దాటికి పార్టీ నేతలు ఒక్కోక్కరుగా వీడుతుంటే నిలువరించే చర్యలు చేపట్టకపోగా అసలు పట్టనట్లు ఉన్నాడు. ఆక్రోశంతో ఏకంగా సీఎం చంద్రబాబుపైనే ఘాటు వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు ప్రతిపక్ష నేత జగన్. రైతు భరోసా యాత్ర వెంటనే రాజధాని భూనిర్వాసితుల కోసం పోరాటం అంటూ ప్రకటన కూడా ఇచ్చేశాడు. అయితే అంతలోనే ఉన్నట్లుండి హఠాత్తుగా లండన్ చెక్కేశాడు.

ఉన్న పళంగా ఆయన ఈ టూర్ వేయటం వెనుక మర్మం ఏంటీ? అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటూ ప్రత్యర్థులు ఆరాతీస్తున్నారు. దీనిపై స్పష్టత ఇస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్ లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ లండన్ లో ఏం చూస్తున్నాడో చూడండంటూ... వైఎస్సార్పీపీ అఫీషియల్ పేజీలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు.

ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్ లలో కనిపించే జగన్ అందులో స్టైలిష్ గా తయారయి రిలాక్స్ గా గోల్ఫ్ ఆడుతూ కనిపిస్తున్నాడు. రెండేళ్లపాటుగా ఊపిరి సలపని ప్రజా ఉద్యమాలతో బిజీగా ఉన్న ఈ  నేత కాస్త రిలాక్స్ అవుతున్నారని ఆ ప్రకటన సారాంశం. పది రోజుల విదేశీ పర్యటన కోసం జూన్ 16న జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లరాదన్న నిబంధన ఉన్నప్పటికీ, అభ్యర్థన మేరకు కోర్టు ఆయనకు సడలింపు ఇచ్చింది. జూన్ 26 న ఆయన తిరిగి ఇండియాకు వస్తారని వచ్చి రాగానే తిరిగి ప్ర్యతేక హోదాపై ఉద్యమం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  london tour  golf playing  telugu news  

Other Articles