రేప్ బాధితురాలు ఎలా చనిపోయింది? | rape victim haned herself and ends life in delhi

Rape victim haned herself and ends life in delhi

rape victim hanged herself, rape victim ends life, delhi rape victim died, harrassed rape victim died, suspicious death of rape victim in delhi, తాజా వార్తలు, ఢిల్లీ అత్యాచార బాధితురాలు ఆత్మహత్య, ఉరేసుకుని అత్యాచార బాధితురాలి ఆత్మహత్య, వేధింపులతో రేప్ బాధితురాలి ఆత్మహత్య, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు

22-year-old 'rape' victim hangs herself, say police. DCP (northeast) Ajit Kumar Singla said police would register a case of abetment of suicide.

రేప్ బాధితురాలు ఎలా చనిపోయింది?

Posted: 06/21/2016 10:37 AM IST
Rape victim haned herself and ends life in delhi

స్నేహితుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ యువతి(22) ఆత్మహత్యకు పాల్పడింది. ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్ జరిగిందీ ఘటన. నెలరోజుల క్రితం యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారంకి పాల్పడగా, కేసు కోర్టులో నడుస్తోంది. అయితే వ్యవహారాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకోవాలని నిందితుల కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారంట. ఈ వేధింపులే  ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.  

సోమవారం పొద్దెక్కినా యువతి గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె గదిలో చూడగా ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే స్థానికులు మాత్రం మరోలా చెబుతున్నారు. తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తితో కలిసి ఆమె వెళ్లిపోయిందని, దీంతో ఆమె తల్లిదండ్రులు అతనిపై కిడ్నాప్, అత్యాచారం కేసు పెట్టారని అంటున్నారు. సూసైడ్ నోట్ లో మాత్రం కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేని బాధితురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉంది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆ వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత నెలలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులిద్దరితోపాటు ప్రధాన నిందితుడి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape victim  hanged herself  northeast delhi  

Other Articles