ట్రంప్ జస్ట్ మిస్సయ్యాడు | British man several times attempt to kill Trump

British man several times attempt to kill trump

murder attempt on trump, britain youth caught while try to kill trump, Las Vegas in a bid to kill the presumptive Republican, Michael Sandford trump, ట్రంప్ పై హత్యాయత్నం, ట్రంప్ కొంచెంలో మిస్సయ్యాడు, ట్రంప్ పై హత్యాయత్నం, తాజా వార్తలు, ట్రంప్ వార్తలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తెలుగు వార్తలు, latest news, telugu news

A 19-year-old Britsh man has been charged for trying to grab a police officer's gun at a Donald Trump rally in Las Vegas in a bid to kill the presumptive Republican presidential nominee. According to a complaint filed in federal court in Nevada, Michael Sandford tried to disarm the officer at Saturday's rally at the Mystere Theatre in the Treasure Island Casino before being overpowered.

ట్రంప్ జస్ట్ మిస్సయ్యాడు

Posted: 06/21/2016 10:31 AM IST
British man several times attempt to kill trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ బ్రిటన్ యువకుడు హత్యాయత్నం చేశాడు. 19 ఏళ్ల మైఖేల్ స్టాన్ ఫోర్డ్, పోలీసుల వద్ద ఉన్న తుపాకిని లాక్కొని ట్రంప్ పై కాల్పులు జరపబోయాడు. దీంతో పెను కలకలం రేగింది. లాస్ వెగాస్ సమీపంలోని ట్రెజర్ ఐలాండ్ కాసినో వద్ద ట్రంప్ ఓ ర్యాలీని నిర్వహిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. మైఖేల్ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు. తాను ఎన్నడూ తుపాకీని వాడలేదని, తనను భద్రతాదళాలు చంపుతాయని తెలుసునని చెప్పాడు. ఒకవేళ, ఇక్కడ విఫలమైతే, ఆపై ఫోనిక్స్ లో ట్రంప్ ర్యాలీలో పాల్గొని చంపేందుకు ప్లాన్ వేశానని తెలిపాడు.

ఇక ట్రంప్ పై హత్యాయత్నం చేసిన మైఖేల్ స్టాన్ ఫోర్డ్, గత ఏడాదిన్నరగా అమెరికాలో ఉంటున్నాడని, ఎన్నోసార్లు ఆయన్ను చంపాలని ప్రయత్నించాడని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. సంవత్సరం నుంచి ట్రంప్ ప్రచారం చేస్తున్న పలు ర్యాలీలకు వెళ్లి, అక్కడ విఫలమయ్యాడని తెలిపారు. బక్కపలచగా, చూడటానికి అమాయకంగా కనిపించే మైఖేల్, హోబోకెన్, న్యూజర్సీ, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో తిరిగాడని అధికారులు పేర్కొన్నారు. సొంతంగా తుపాకీని తెస్తే, పోలీసుల ఫ్రిస్కింగ్ లో భాగంగా దొరికి పోతానన్న భయంతోనే పోలీసు నుంచి లాక్కోవాలని ముందే ప్రణాళిక రచించుకున్నాడని వివరించారు. జాకబ్ అనే భద్రతాధికారి వద్ద అన్ లాక్ చేసున్న గన్ చూసి దాన్ని తీసుకుంటే సులువుగా కాల్పులు జరపవచ్చని భావించాడని, ఈ క్రమంలో తన ప్లాన్ విఫలమై దొరికిపోయాడని తెలియజేశారు. బ్రిటన్ ఎంబసీ సాయంతో మైఖేల్ ను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  murder attempst  britain youth  Michael Sandford  

Other Articles