యోగా డే స్పెషల్ : ఒత్తిడికి అసలైన ఔషధం | International yogaday 2016 special story

International yogaday 2016 special story

international yogaday, yogaday international yogaday, international yogaday 2016, second modi in chandigarh yoga celebrations, yogaday in India, yogaday 2016 celebrations in India, yogaday special 2016, international yogaday june 21, Modi in international yogaday, చంఢీగడ్ యోగాడేలో మోదీ, మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా దినోత్సవం, 2016 యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2016, రాజ్ పథ్ లో యోగా డే సెల్రబేషన్స్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, yoga day news, telugu news

International yogaday special story. India ready to grand celebrations.

యోగా డే స్పెషల్ : ఒత్తిడికి అసలైన ఔషధం

Posted: 06/21/2016 10:20 AM IST
International yogaday 2016 special story

యోగ = ఆధునిక శాస్త్రం + బుషులు జ్ఞానం. ఇది మన సాంప్రదాయ గ్రంధములో వివరించబడిన ఒక పురాతన కళ. అసలు ఆది మానవుని జననంతోనే యోగ విద్య ప్రారంభమైందని చెప్పవచ్చు. నిత్యం ఒత్తిడిలో ఉండే మనిషి జీవన విధానానికి చాలా కీలకం. శక్తివంతమైన మందు. రోగాలు రాకుండా కాపాడుతుంది. ప్రకృతికి దగ్గరగా జీవించడమే దీని ఉద్దేశం. ఈ అభ్యాసం మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనం ప్రసాదించడమే గాక మనిషి జీవితంలో సుఖ, సంతోష, ఆనందాల్ని నింపుతుంది. పరమేశ్వరుడు యోగ విద్యకు ఆద్యుడు అని అంటారు. అనేకమంది యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మార్షులు యోగావిద్యను ప్రపంచానికి అందించారు. యోగశాస్త్రం మన భారతదేశంలో ఆధ్యాత్మికత్వాన్ని సంతరించుకొని మూడు పూవులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మధ్యలో దీనిని పక్కనబెట్టినప్పటికీ ఇప్పటి యుగంలో యోగవిద్యకు సైన్సుసాయం లభించింది. మొత్తం 84 లక్షల ఆసనాలు ఉండగా,  కేవలం 84 మాత్రమే మనం పాటిస్తున్నామట. జిమ్ కన్నా యోగ ఉత్తమమైనదని చెప్పటానికి 15 కారణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. ఇక పలువురు మేధావులు, డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే విధంగా యోగశాస్త్రాన్ని మలిచి యోగాచికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి మహోపకారం చేశారు, చేస్తున్నారు కూడా. కొన్ని రెగ్యులర్ ఆసనాలు ఇక్కడ మీకోసం...

వ్రికాసనం-


టీ ఫోజ్ యోగ ఇది బ్రెయిన్ కు చాలా ప్రయోజనం.నిటారుగా నిల్చువాలి. నిల్చొని రెండు చేతులను పైకి లేపాలి. ఈ పొజిషన్ లోని యోగాసనం బ్రెయిన్ కు చాలా సహాయపడుతుంది.

మయూరాసనం-


డయాబెటిక్ తో బాధపడే వారికి యోగాసనం చాలా ఉపయోగకరం. ఈ ఆసనం వల్ల శరీరంలోని అవయవాలన్నీ చురుకుగా పనిచేసి, రక్తప్రసరణ అందించి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుందని అనేక మంది నిపుణులు నిర్ధారించారు.

ముద్రాసనం-


ఈ ఆసనంను మనం రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఈ యోగా భంగిమన వ్యాధినిరోధకను పంెచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆందోళను నివారించడంలో సహాయపడుతుంది.

సూర్య నమస్కారం-


సూర్య నమస్కారం ఉదయం నిటారుగా పడే సూర్యని యొక్క కిరణాల్లో నిలబడి సూర్యునికి నమస్కరిస్తూ చేసే భంగిమ. ఈ భంగిమలో మన శరీరంలో అన్ని అవయవాలు కదిలికలు కలిగి ఉంటుంది. సూర్య నమస్కారంలో 12 డిఫరెంట్ భంగిమలు కలిగి ఉంటాయి. వీటిలో చాలావరకూ ముందుకు మరియు వెనుకకు చేసే భంగిమలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

వజ్రాసనం-


మొదట కాళ్ళు చాచి కూర్చోవాలి. వీపు నిటారుగా ఉండాలి. కుడికాలుని మోకాలు వద్ద వుంచి పాదాన్ని కుడి పిరుదు క్రిందికు చేర్చాలి. అలాగే ఎడమ కాలుని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు క్రిందకు చేర్చాలి. రెండు చేతులతో కాళ్ళ ముడుకులు పట్టుకుని నడుము వంగకుండా నిటారుగా ఉండాలి. కళ్ళు పూర్తిగా మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాద్యమైనంత వరకూ బంధించి నిధానంగా వదలాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తొడలు, కాలి పిక్కల కండరాలు ధృడంగా తయారవుతాయి.

పవన ముక్తాసనం-


ముందుగా వెల్లకిలా పడుకొని గాలి లోపలికి పీల్చాలి. రెండు కాళ్ళను ఎత్తి మోకాలి వద్ద మడవాలి. తర్వాత 0 రెండు చేతులతో మోకాళ్ళను పొత్తి కడుపు మీదకు తేవాలి. ఊపిరి బిగపట్టి, తలను ఎత్తి, ముక్కుతో మోకాళ్ళను తాకాలి. తర్వాత శ్వాస విడుస్తూ తిరిగి కాళ్ళను చాపుతూ మామూలు స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల పొట్టలోని గ్యాస్ తీసివేస్తుంది. ఉదర కండరాల పని తీరు మెరుగుపరుస్తుంది. ఛాతీ భాగం, భుజాలు, చేతుల నొప్పులు పోగొడుతుంది. కడుపు భాగంలో పేరుకునే కొవ్వు పరిమాణం తగ్గుతుంది. పోస్ట్ మెనోపాజ్ లోని మహిళలకు ఇది చాలా ఉపయోగం. కడుపు భాగంలోనే కాక, తొడలు, మోకాళ్ళ కండరాలు బలోపేతం చేస్తుంది.

బాలాసనం-


పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ బాల భంగిమ బాధను నివారించి, నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

నటరాజ ఆసనం-


ఈ ఆసనం స్థితి శివుని నాట్య భంగిమను పోలి ఉంటుంది. కాబట్టి దీనికి నటరాజాసనం అని పేరు. నిటారుగా సమస్థితిలో నిలబడిన తర్వాత ఎడమకాలిని(ఫొటోలో ఉన్నట్లు) మోకాలి వద్ద వెనక్కు వంచాలి. ఆ కాలి మడమను ఎడమచేత్తో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు కాలు, చేయి పరస్పరం వ్యతిరేక దిశలో లాగుతున్నట్లు ఉండాలి. ఇప్పుడు దేహాన్ని ముందుకు వంచి కుడి చేతిని ముందుకు చాపాలి. ఈ స్థితిలో దేహం ఒక కాలి మీద ఉంటుంది, దృష్టి నేరుగా ఉండాలి. ఉచ్వాసనిశ్వాసలు సాధారణంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ పాదాన్ని తల మీదకు తెచ్చే ప్రయత్నం చేయాలి (తీసుకు రాగలిగినంత వరకే చేయాలి. బలవంతంగా ప్రయత్నించరాదు). ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. యథాస్థితికి వచ్చేటప్పుడు ఎడమకాలిని, కుడిచేతిని నిదానంగా కిందకు దించి సమస్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇదే క్రమాన్ని కుడికాలితో కూడా చేయాలి. ఇలా మూడు నుంచి ఐదు సార్లు చేయాలి. నటరాజ ఆసనం వేయడం ద్వారా ఏకాగ్రత పెరగడంతోపాటు వెన్నెముక శక్తిమంతం అవుతుంది. శరీరంలోని కండరాలు ఉత్తేజితమవుతాయి. ఆర్థరైటిస్, కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. భుజం, తుంటి, మోకాళ్లు, చీలమండ ఉత్తేజితమవుతాయి. సంభోగశక్తి మెరుగవుతుంది. స్థిర సంకల్ప శక్తి, కంటి చూపు మెరుగవుతాయి.


ఇవే కాదు హలాసనం, ముస్త్యాసనం, బిటిలాసన, శిర్సాసనం, అర్థకటి చక్రాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, కపాలాభాతి లాంటివి ఉన్నాయి.

ఇక మనం దేశం ప్రపంచానికి పరిచయం చేసిన ఈ యోగా ప్రాముఖ్యత ప్రధాని మోదీ చోరవతో ఖండాంతరాలు దాటింది. విదేశీయులు యోగా ప్రాముఖ్యత గుర్తించి ఆచరించేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అయితే జూన్ 21 ని ఏకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేసింది. నేడు (జూన్ 21న) ఇంటర్నేషనల్ యోగ డే(అంతర్జాతీయ యోగా దినోత్సవం)ను ఘనంగా నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి యోగాడే అద్భుతంగా కవరేజ్ చేసిన దూరదర్శన్ (డీడీ) మరోసారి అదే రీతిలో చిత్రీకరించేందుక సిద్ధమైతుంది.  ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద  ఈ కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే తరహాలో కవర్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ యోగా గురు రాందేవ్ ఆధ్వర్యంలో ఇది జరగనుంది. ఇక కేంద్రమంత్రులు సెలబ్రిటీలు ఇప్పటికే యోగా ప్రాక్టీస్ లో తలుమునకలై పోతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతటా యోగా డే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ చండీగఢ్ లో నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫిట్ నెస్ తోపాటు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రజలంతా ముఖ్యంగా విద్యార్ధులు కదిలి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా యోగా డే కోసం స్పెషల్ ఏర్పాట్లు చేసేశారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : international yogaday  june 21  modi in yogaday  yogaday celebrations  

Other Articles