'spectacular' footage of giant spider crabs massing in Australian waters off Melbourne

Horde of giant crabs amass off of the australian coast

Australia, Wildlife, viral news, crabs, sealife, australian wildlife, giant spider crab, horde of crabs, Sheree Marris, shocking video, Port Phillip Bay, Melbourne, sea life, animal news

“Spectacular” film footage has captured hundreds and thousands of giant spider crabs gathering off the coast of Melbourne.

ITEMVIDEOS: షాకింగ్ వీడియో.. స్వభావాలు మార్చుకున్నాయి..

Posted: 06/18/2016 05:31 PM IST
Horde of giant crabs amass off of the australian coast

మన పెద్దలు ఏదైనా నానుడి చెప్పారంటే.. ఎన్ని తరాలు మారినా వాటికి తిరుగుండదు. అలాంటి నానుడిలో ఒకటి సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అని. గుర్తుందా..? మనుష జాతికి చెందిన మహిళలను సీతలుగా పరిగణిస్తే.. నాటి సీత అనుభవించిన కష్టాలకన్న అధికంగా వున్నాయి. దేశంలో ఎక్కడ చూసిన మహిళలు, యువతులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, గృహ హింసలు, లాంటి సమస్యలతో ప్రపంచ వ్యాప్తంగా సీతలు కష్టాలు పడుతూనే వున్నారు. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటారా..? అక్కడికే వస్తున్నాం. సీతల తలరాత మారకున్నా పీతలు మాత్రం తలరాతను మార్చుకున్నాయి.

ఒకేసారి పెట్టిన వేలాది గుడ్ల ద్వారా ఉద్భవించే పీతలు.. పెరిగేకొద్దీ స్వజాతి జీవులను సహించలేవు. ఆహారం, స్థలం.. అన్నింటికోసం ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. అలాంటి పీతలు ప్రస్తుతం క్రమంగా ఒక్కటవుతుూ తమ తలరాతను మార్చకుంటున్నాయి. పీతల జీవన విదానంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలే బయటికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సముద్రగర్భ శాస్త్రవేత్త షెరీ మారిస్ తీసిన వీడియోతో ఈ విషయం బయటపడింది.

మెల్ బోర్న్ లోని పోర్ట్ ఫిలిఫ్ బే సముద్ర గర్భంలో యాదృచ్ఛికంగా తీసిన వీడియోలో.. జెయింట్ క్రాబ్(రాకాసి పీత) ఒకటి ముందు నడుస్తుండగా, వేలాది పీతలు దాన్ని అనుసరిస్తూ కనిపించాయి. ఎవరిమీదో దండయాత్రకు వెళుతున్నట్లు లేదా కవాతు నిర్వహిస్తున్నట్లు క్రమపద్ధతిలో సాగిపోయిన పీతల బృందం తనకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు షెరీ చెప్పింది.  ప్రాణ రక్షణ, ఆహార సేకరణ వంటి అత్యవసరాలను ఒంటరిగాకంటే బృందంగా ఉంటేనే చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతోనే ఒక్కటయ్యాయని, అవి స్వజాతివైరం వీడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Wildlife  viral news  crabs  sealife  Sheree Marris  shocking video  Port Phillip Bay  Melbourne  

Other Articles