Gujarat Minister Shankar Chaudhary Misspells 'Elephant' During School Visit, Says It Was Intentional

Mba gujarat minister shankar choudhary spelt elephant as elephent

Gujarat minister,Shankar Chaudhary,spelling of elephant, ,Elephant,Elephent,School,Misspelled words

A school visit of Gujarat Minister Shankar Chaudhary turned out to be a massive fail, who ended up writing 'elephant' as 'E-L-P-H-E-N-T”.

ITEMVIDEOS: గుజరాత్ మంత్రితో అటాడుకున్న ‘ఏనుగు’..

Posted: 06/18/2016 09:41 AM IST
Mba gujarat minister shankar choudhary spelt elephant as elephent

గుజరాత్ కు చెందిన ఓ మంత్రివర్యులను 'ఏనుగు' అటాడుకుంది. ఎంతలా అంటే ఆయన పరిజ్ఞానాన్ని విమర్శల పాలు చేసేంతగ. ఏనుగు మంత్రివర్యులతో అటాడుకుంటే మరి ఆయన సెక్యూరిటీ ఏం చేస్తున్నారనేగా మీ డౌట్. వాళ్లు కూడా వున్నారు. అందరి సమక్షంలోనే మంత్రిగారి పరువు పోయింది. అదెలా అంటారా..? ఏనుగు పదాన్ని ఇంగ్లీష్లో ఎలిఫ్యాంట్ అని రాయడమే. రాయడం వరకు ఓకే అయితే స్పెల్లింగ్ మిస్టెక్ రాయడంతోనే అమాత్యుల వారు విమర్శల పాలయ్యారు.

దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన  ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. 'A' బదులు 'E' రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది.

దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ... తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై కూడా మంత్రిపై విమర్శలు ముంచెత్తాయి. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్‌ధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat Minister Shankar Chaudhary  spelling  elephant  

Other Articles