Fake Baba Who Robed ‘Lifestyle’ Owner’s House

Fake baba shiva arrested in banglore

Robbery, fake baba, Hyderabad, Madhusudhan, Lifestyle Owner, Fake Baba Rob, Lifestyle Owner House in Hyderabad, buddappa gari shive, shive fake baba, task force, viral news

A fake Baba who conned Hyderabad lifestyle building owner Madhusudhan Reddy for more than one crore 30 lakhs been arrested in banglore.

ITEMVIDEOS: బురిడీ బాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Posted: 06/16/2016 07:04 PM IST
Fake baba shiva arrested in banglore

రూ.లక్షను రూ.రెండు లక్షలు చేస్తానంటూ రైస్‌ పుల్లింగ్‌ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న దొంగ బాబా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు, పూజలు, వ్రతాల పేరుతో భక్తులను ముగ్గులోకి దింపి ఉడాయించిన బురిడీ బాబాను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. రేపు అధికారికంగా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించే అవకాశముంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బురిడీ బాబాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ బాబా నిన్న రాత్రే బెంగళూరు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

చోరీ అనంతరం పరారైన బాబా బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శివను హైదరాబాద్కు తరలిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న లైఫ్ స్టైట్ బిల్డింగ్ యజమాని మధుసూధన్ రెడ్డిని బురిడీ కోట్టించడంతో నకిలీ బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన బుడ్డప్పగారి శివగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి నగలు, నగదు ఉన్న మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పూజలు, పుణ్యకారాలతో మీకు ఉన్నదానికి రెట్టింపు కలిసి వస్తుందని, అందుకుగాను తన బురిడీ విద్యను చూపించి.. అలానే బంగారాన్ని, నగదును కూడా రెట్టింపు చేస్తానని నమ్మబలకడంతో పలువురు భక్తులు ఈ బురిడీ బాబా మాటలను నమ్మి మోసపోయారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి, రూ.1.33 కోట్లతో దొంగ బాబా శివ పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఇతనికి సంబంధించిన చిట్టాను పోలీసులు విప్పారు.

ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ బురిడీ బాబా జాబితా..

* రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్‌చల్‌
* నెల్లూరులోనూ లక్ష్మీదేవి పూజల పేరుతో రూ.40 లక్షలు అపహరించాడు.
* చిత్తూరు జిల్లా అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లోనూ ఓ కుటుంబాన్ని మోసం చేసిన కేసు
* తాజాగా, మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని కోటి 30 లక్షల మేర మోసం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles