This man fooled 2 lakh people on Facebook with his ‘predictions’, here’s how

This guy s predictions for 2016 are going viral

pablo reyes, man fools 2 lakh people on facebook, man predicts us future in facebook post, viral facebook post, viral news, cheating, editing

The Internet is going crazy sharing his status; with over 200,000 shares already, and the number’s increasing by the minute. People are shocked at this ‘accurate prediction’ of world affairs.

2 లక్షల మంది ఫేస్ బుక్ యూజర్లు ఫూల్ అయ్యారు..

Posted: 06/16/2016 11:30 AM IST
This guy s predictions for 2016 are going viral

ఈ తరం సోషల్ మీడియాదే. అక్కడ హీరోలైన వారికి తిరుగులేదు. దీంతో తన తెలివితేటలన్ని వినియోగించిన ఓ యువకుడు రెండు లక్ష్లల పైచిలుకు మందిన ఫూల్స్ గా నిరూపిస్తున్నాడు. మన దెగ్గర పోతులూరి వీరబ్రహ్మేంధ్ర స్వామి. పాశ్చాత్య దేశాలలో నాస్టర్డ్ థామస్, ఇటీవల ఇస్తాంబుల్ వృద్ద మహిళ మాదరిగా తాను కూడా కాలజ్ఞానం ప్రావిణ్యుడినని చెప్పేసి.. పిచ్చివాళ్లను చేస్తున్నాడు. తనకు కూడా కాలజ్ఞానం తలుసునని.. ఇవాళ కాకపోతే రేపు తన పేరును అందరూ గుర్తు చేసుకుంటారని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు.

దీంతో ఓ యువకుడి భవిష్యత్ ను ముందే ఊహించి, చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయని.. అతనెప్పుడో పోస్టు చేసిన భవిష్యత్తుకు సంబంధించి ఊహించిన విషయాలు ఇప్పుడు వాస్తవాలుగా మారుతున్నాయని నెట్ జనులు అతని మాటల్ని షేర్ చేసుకుంటున్నారు. అమెరికాలో ఏం జరగబోతుందో చెబుతూ గతేడాది డిసెంబర్ లో పాబ్లో రెయెస్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. దిగ్గజ బాక్సర్ మహ్మద్ అలీ, పాప్ మ్యూజిక్ స్టార్ ప్రిన్స్ మరణం, ఆర్లెండో నైట్ క్లబ్ లో నరేమేధం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ వార్తల్లో నిలిచింది.

పాబ్లో రెయెస్ చెప్పినట్టుగా అమెరికాలో ఘటనలు జరుగుతుండడంతో అంతా విస్తుపోతున్నారు. 2016లో అమెరికాకు హిల్లరీ క్లింటన్ తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారని, గోరిల్లా మరణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని, ప్రిన్స్, మహ్మద్ అలీ, కింబొ స్లైస్, డొనాల్డ్ ట్రంప్ చనిపోతారని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. అమెరికా చరిత్రల్లో భారీ కాల్పులు చోటు చేసుకుంటాయని కూడా ఊహించి చెప్పాడు. ఎవరినీ భయపెట్టడానికి తాను ఈ విషయాలు చెప్పడం లేదని, కానీ తన పేరును అందరూ గుర్తు పెట్టుకుంటారని తన పోస్ట్ లో రాశాడు.

తెలివిగా మోసం చేసిన పాబ్లో రెయెస్

భవిష్యత్తును ముందుగానే ఊహించిన పాబ్లో రెయెస్ చెప్పినట్టుగానే అమెరికాలో ఘటనలు జరుగుతున్నాయి. అతడు అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడని అందరూ ఆశ్చర్య పోతున్నారు. పాబ్లో రెయెస్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు 2 లక్షల మందిపైగా దీన్ని షేర్ చేశారు. ఈ సంఖ్య ప్రతి నిమిషానికి పెరుగుతోంది. అయితే పాబ్లో రెయెస్ ఎవరు అనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే పాబ్లో రెయెస్ పోస్టు అంతలా వైరల్ కావడానికి  అతను తన తెలివిని వినియోగించాడు.

సరిగ్గా గత ఏడాది డిసెంబర్ లో అయన వర్ణ వివక్షతో అమెరికాలోని తెల్లవర్ణాలను వ్యతిరేకిస్తూ ఓ పోస్టు పెట్టాడు. తెలుపువర్ణం వారు ఎక్కడబడితే అక్కడ చివరకు టోర్నోడోలు వద్ద కూడా సెల్ఫీలు తీసుకుంటారని ఓ పోస్టును పెట్టాడు. దానిని తెలివిగా ఎడిట్ చేసి.. తానేదో భవిష్యత్తును ముందుగానే చూసినట్లుగా తన ఊహలన్నింటినీ చిన్న పోస్టుగా మలిచి పెట్టినట్లుగా మార్చాడు. అయితే ఇక్కడ అమెరికాలో తాజాగా జరిగిన ఘటనలను కూడా పేర్కోన్నాడు. అంతేకాదు డోనాల్డ్ ట్రంప్ కూడా మరణిస్తాడని, అలా కొన్ని తన ఊహలను కలపి పెట్టాడు. దీనిని సేవ్ చేసి పోస్ట్ చేశాడు. అంతే అతని తెలివితేటలను గమనించకుండా పోస్టును మాత్రమే చూసిన నెట్ జనులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఇంకేముందు మనవాడి తెలివితేటల ముందు క్షణక్షణం అంతకంతకూ పెరుగుతున్న ఫూల్స్ సంఖ్య ఎక్కడ నిలుస్తుందో వేచి చూడాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pablo Reyes  prediction  Facebook post  viral news  cheating  editing  

Other Articles