With New Reforms, Flights To Become Cheaper, Lots Of 'No Frills' Airports

Aviation stocks fly high as cabinet approves new aviation policy

civil aviation policy, civil aviation policy highlights, what is civil aviation policy, indian flights, domestic flights, new flight rates, National Aviation Policy, 5/20 rule airfare, ashok gajapathy raju, middle class

The Union Cabinet cleared the Civil Aviation Policy in order to boost the domestic aviation sector and provide passenger-friendly fares.

మధ్యతరగతి వర్గాలకు విమానయానం.. ఇప్పుడిక ఈజీ..

Posted: 06/15/2016 04:59 PM IST
Aviation stocks fly high as cabinet approves new aviation policy

సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఏవియేషన్ పాలసీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన విమానయానం ఇకపై ఉన్నత మధ్యతరగతి, సాధారణ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు గగనవీధుల్లో విహరించే విమానాలను చూసి సంబరపడిన మధ్యతరగతి వర్గాలు ఇకపై గంటలోపు ప్రయాణం వున్న పట్టానాలకైనా విమానంలో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ముసాయిదా పాలసీకి కొన్ని మార్పు చేర్పులు చేసి కొత్త జాతీయ విమానయాన విధానానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎన్డీయే  ప్రభుత్వం భారతదేశ మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ నేషనల్ సివిల్ ఏవియేషన్ విధానానికి ఆమోద ముద్ర వేసింది, ఇది  ఆ రంగంలో  ప్రధాన మార్పులకు నాంది అవుతుందని ట్వీట్ చేశారు. ఈ కొత్త విధానం  వివరాలు పూర్తిగా వెల్లడి కాకపోయినా, 5/20 నిబంధన స్థానంలో కొత్త నిబంధనను చేర్చినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీ ప్రోత్సహించడానికి,  కార్గో ఆపరేషన్లు పెంచడానికి చర్యలతో పాటు, విదేశాల్లో నడిపే విమానాలకు  అనుమతించే నియమాలలో కొన్ని మార్పులు  చేసినట్టు విమానయాన మంత్రిత్వశాఖ సీనియర్  అధికారి  తెలిపారు.  

ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (ఆర్ సీఎస్) కింద విమాన టికెట్ గంటలోపు రూ. 2500, అరగంటలోపు అయితే రూ. 1,200గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ కనెక్టివిటీ పథకం  కింద విమానయాన సంస్థలు రూ 8,000 చెల్లించాలనే ఒక ప్రతిపాదన తొలగించింది. 5/20 నిబంధన  ప్రకారం  ఐదేళ్ల ఫ్లయింగ్ సర్వీసుతోపాటు, కనీసం 20  విమానాలు కలిగి ఉన్న సంస్థకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు అందించే  వీలుంటుందనే నిబంధనలో ఐదేళ్ల  సర్వీసును తొలగించింది.

దీంతో ఎయిర్  ఏసియా ఇండియా, విస్తారా లాంటి  సంస్థలు  సంతోషం వ్యక్తం చేశాయి.  దీనిపై విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మీడియా సమావేశం  నిర్వహించనున్నట్టు  సమాచారం. మరోవైపు కొత్త ఏవియేషన్ విధానాన్ని ఆమోదించిన కేంద్ర విమానయాన సంస్థలకు తీపి కబురు అందించడంతో విమానయాన రంగ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్  తదితర  షేర్లు దూసుకుపోతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles