Kapu JAC calls bandh in East Godavari Over Mudragada Padmanabham Arrest

Bandh continues peaceful in east godavari over mudragada arrest

mudragada hunger strike, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR, pawan kalyan

The arrest of Kapu leader Mudragada Padmanabham led to bandh by Kapu Joint Action Committee is going on peacefully in east godavari district.

ITEMVIDEOS: ముద్రగడ అరెస్టును నిరసిస్తూ.. తూగోలో బంద్

Posted: 06/10/2016 06:23 PM IST
Bandh continues peaceful in east godavari over mudragada arrest

కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దీక్షను భగ్నం చేసి, ఆయనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాపు సామాజిక సంఘం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కాపులకు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించిన టీడీపీ, అధికారంలోకి విచ్చి రెండేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలం కావడంతో తక్షణం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం  అమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

కాపు సంఘం నేతల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు స్వచ్చందంగా తమ వ్యాపారాలను, దుకాణాలను మూసివేశారు. జిల్లా కాపు నేతల పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా సహకరించారు. జిల్లాలో వాణిజ్య, రవాణా దాదాపుగా స్థంబించాయి. బంద్ ను విఫలం చేయడానికి పోలీసులు యత్నించినా.. వారి ప్రయత్నాలు సపలం కాలేదు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసలు పిక్కెట్లు, చెక్ పోస్టులు ఏర్పాటు, భారీగా మోహరించిన పోలీసులతో జిల్లాలో ఎక్కడ చూసినా ఇవాళ పోలీసులే కనిపించారు.

పోలీసులు కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు నిబంధలను అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తుండగా, సెక్షన్ 30ను కూడా అదనంగా జోడించారు. ఇదిలావుండగా పోలీసులు తన దీక్షను భగ్నం చేసినా.. ముద్రగడ మాత్రం అస్పత్రిలోనూ తన దీక్షను కోనసాగిస్తున్నారు. మరోవైపు అమలాపురం వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లో విధులకు అటంకం కలిగించిన కేసులో ముద్రగడ సద్మనాహం సహా పలువురు కాపు నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  police over action  mudragada son  arrest  kirlampudi  kapu stir  

Other Articles