andhra pradesh governments impliments un official emergency on few media channels

Few channel telecasts drop in andhra pradesh over mudragada stir

mudragada hunger strike, Indian Journalist Union, Sakshi Channel Broadcasts, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR, pawan kalyan

The arrest of Kapu leader Mudragada Padmanabham leads andhra pradesh governments implimentation of un official emergency on few media channels

మీడియాపై చంద్రబాబు సర్కార్ అనధికార ఎమర్జెన్సీ..?

Posted: 06/10/2016 06:30 PM IST
Few channel telecasts drop in andhra pradesh over mudragada stir

ఆంద్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం మీడియాపై ఎమర్జెన్సీని ప్రకటించింది. తమ అనుకూల చానెళ్లను ప్రసారం చేస్తూ.. తమకు వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న చానెళ్లపై మాత్రం ఉక్కుపాదం మోపుతంది. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ కు చెందిన సాక్షి ఛానెల్ సహా పలు చానెళ్లను కాపు సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం దీక్షను, అరెస్టుకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయవద్దని అనదికార అదేశాలను జారి చేసింది. వాటిని అమలు పర్చిన ఛానెళ్లను వదిలేసి, అమలు చేయనా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసింది,

నిప్పులాంటి మనిషి, నా జీవితం తెరచిన పుస్తకమని తన గురించి నిత్యం చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మీడియా మేనేజింగ్ లో దిట్టని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువైంది, కాగా ప్రజలకు నిజాలను అందిస్తున్న చానెళ్లను నిలిపివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విమర్శలు కూడా వినబడదుతున్నాయి, కాపుల విషయంలో కడప జిల్లా సమావేశంలో మీడియాపైనే ఆయన ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. కాపులకు ఏమి హామీలిచ్చానో మీకు తెలియదా..? మీకు తెలియకుండానే నేను కాపులకు హామీలను ఇచ్చానా...;? అన్న ఎదరుప్రశ్నలు అయనలోని నైరాశ్యాని వెల్లడిస్తుందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.

తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు సామాజిక వర్గీయులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం... పోలీసులు బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి ముద్రగడను అరెస్ట్ చేయడం.. గోదావరి జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కధనాలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి సహా పలు మీడియా ఛానెళ్లపై అభాండాలు వేస్తూ ప్రసారాలను నిలిపి వేసేలా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలను జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చానెల్ ప్రసారాలు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో పలువరు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

ఏపీలోని పలు జిల్లాల్లో మీడియాపై అంక్షలు విధించడం, పలు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్య ప్రత్యక్షంగా భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె. అమరనాథ్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐ.వి.సుబ్బారావులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రసారమాధ్యమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలోనే సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకున్నట్లుగా ఐజేయూ భావిస్తోందన్నారు. తక్షణమే సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles